Ram mandir Darshan Timings: అయోధ్యలో శ్రీరాముడు కొలువుదీరాడు. రామమందిరం ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా ముగిసింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామ్‌లలా ప్రాణ ప్రతిష్ఠ పూర్తయింది. రేపట్నించి సామాన్య భక్తులు రామమందిరాన్ని సందర్శించుకోవచ్చు. ఎప్పుడు,, ఎలా సందర్శించుకోవాలో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. బాలరాముని ఆకారంలో కొలువు దీరిన రాముని విగ్రహానికి ఇవాళ అంటే జనవరి 22వ తేదీ 2024 మద్యాహ్నం 12.29 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ ప్రక్రియ ప్రారంభమై...రెండే రెండు నిమిషాల్లో అంటే 12.31 గంటలకు ముగిసింది. మొత్తం కార్యక్రమం 86 సెకన్లు సాగింది. అనుకున్న అభిజీత్ ముహూర్తంలో రామ్‌లలా ప్రాణ ప్రతిష్ట వేద మంత్రోఛ్చారణల నడుమ పూర్తయింది. ప్రదాని నరేంద్ర మోదీతో పాటు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, యూపీ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, ఆర్ఎస్ఎస్ అదినేత మోహన్ భాగవత్, రామమందిరం ఆలయ ప్రధాన అర్చకుడు సత్యేంద్రనాథ్ మాత్రమే గర్భగుడిలో ఉన్నారు. మిగిలిన వీవీఐపీలంతా బయటే ఉన్నారు. 


రేపట్నించి దర్శనం ఇలా


ఇక రేపట్నించి సామాన్య భక్తులు అయోధ్య రామమందిరాన్ని సందర్శించుకోవచ్చు. ఉదయం సుప్రభాత సేవతో స్వామి పూజలు మొదలవుతాయి. ఆర్జిత సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. ఆ తరువాత సర్వ దర్శనం ఉంటుంది. భక్తుల సందర్శన వేళల్ని రామ జన్మభూమి ఆలయ కమిటీ ప్రకటించింది. రోజూ ఉదయం 7 గంంటల్నించి 11.30 గంటల వరకూ దర్శనం చేసుకోవచ్చు. అనంతరం మద్యాహ్నం 2 గంటల్నించి సాయంత్రం 7 గంటల వరకూ దర్శించుకోవచ్చు. తెల్లవారుజామున 6.30 గంటలకు జాగరణ్ హారతి ఉంటుంది. మద్యాహ్నం 12 గంటలకు బోగ్ హారతి, సాయంత్రం 7 గంటలకు సంధ్యా హారతితో ఆలయం మూసివేస్తారు. 


https://online.srjbtkshetre.org/#/login. ఇది శ్రీరామ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్ట్ అధికారిక వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్ ద్వారా స్వామి వారి సేవా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ముందుగా ఫోన్ నెంబర్ రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తరువాత మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీతో యూజర్ ఐడీ జనరేట్ అవుతుంది. ఆ ఐడీ ఆధారంగా స్వామి వారి సేవా టికెట్లు, ఆర్జిత సేవలు వంటివి బుక్ చేసుకోవచ్చు. అయోధ్య రాముని దర్శన సమయాలను ట్రస్ట్ విడుదల చేసింది. ఉదయం 7 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 7 గంటల వరకు రామయ్య దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు.


Also read: Healthy Foods: మీ పిల్లలకు పరగడుపున ఈ 5 పదార్ధాలు ఇస్తే అన్ని సమస్యలకు చెక్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook