Ayodhya Ram mandir: రాముని ప్రాణ ప్రతిష్ట రోజు మీ ఇంట్లో ఇలా చేస్తే ధన సంపదలు, సుఖ సంతోషాలు
Ayodhya Ram mandir: ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న అపురూప ఘట్టం వచ్చేసింది. మరి కొద్ది గంటల వ్యవధిలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ అత్యంత ఘనంగా జరగనుంది. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ వేళ మీ ఇంట్లో కూడా ఈ 7 పనులు చేస్తే మంచిదని సూచిస్తున్నారు పండితులు.
Ayodhya Ram mandir: జనవరి 22 అంటే రేపు అయోద్య రామమందిరం ప్రారంభోత్సవ వేడుకకు అయోధ్య సిద్ధమైంది. అయోధ్యతో పాటు దేశమంతా రాముని ప్రత్యేక పూజలు చేయనున్నారు. మరి కొద్దిగంటల్లో అయోధ్య రామాలయం కోరిక నెరవేరనుంది. మీరు కూడా మీ ఇంట్లో కొన్ని మంచి పనులు చేస్తే మీ ఇంట సుఖ సంతోషాలు వర్ధిల్లుతాయంటున్నారు జ్యోతిష్య పండితులు.
శ్రీరాముడు అయోధ్యకు తిరిగి రానున్నాడనే స్లోగన్లు అయోధ్యలో మిన్నంటుతున్నాయి. మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానున్న రామమందిరం కోసం మొత్తం హిందూవులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా 7 శుభకార్యాలు చేయమని సూచిస్తున్నారు పండితులు. ఇలా చేస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందంటున్నారు. ప్రతి హిందువు తమ ఇళ్లలో రాముని విగ్రహం అమర్చుకుని పూజలు చేయాలంటున్నారు.
ముఖ్యంగా శ్రీరాముడి ఆగమనానికి గుర్తుగా ఇంటి నలువైపులా దీపం వెలిగించాలి. రాత్రి 12 గంటల వరకూ ఈ దీపాలు వెలుగుతుండాలి. ఇంట్లో ప్రధాన గుమ్మానికి ఇరువైపులా దీపం పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో సుఖ సంతోషాలు లభిస్తాయి. జనవరి 22వ తేదీ అంటే రేపు ఉదయం త్వరగా లేచి స్నానం చేశాక ఇంటి పరిసరాలు శుభ్రం చేయాలి. కేసరి పాయసం చేయాలి. అందులో డ్రై ఫ్రూట్స్ తప్పకుండా వేయాలి. అయోధ్యలో రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ తరువాత ఇంట్లో రాముడి పాయసం బోగం సమర్పించాలి. ఆ తరువాత ప్రసాదాన్ని అందరికీ పంచాలి.
రాముడి అయోధ్య రాక సందర్భంగా ప్రతి ఇంట్లో వేడుకలా జరపాలి. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉంటే దూరమౌతుంది. ఇంటి వాతావరణం పవిత్రంగా మారుతుంది. ఇంట్లో శంఖం పూరించాలి. శంఖం లేకుంటే గంట కూడా మోగించవచ్చంటున్నారు జ్యోతిష్య పండితులు. రేపు వీలైనంతవరకూ పేదలకు, ఆపన్నులకు పండ్లు ప్రదానం చేయాలి. దాంతోపాటు నిస్సహాయులకు , నిరుపేదలకు వెచ్చని దుస్తులు దానం చేయాలి. ఇలాంటి మంచి పనులు చేస్తే శ్రీరాముడు ఇంటికి వస్తాడంటారు.
రేపు ఇంటి పరిసరాల్లో పసుపు నీళ్లు చల్లాలి. ఇంట్లో పూజాది కార్యక్రమాలు నిర్వహించాలి. పూజ తరువాతే ఇంటి బయట పసుపు నీళ్లు చల్లాల్సి ఉంటుంది. రామ రక్షస్తోత్రం పఠించాలి. ఇలా చేయడం వల్ల ఇంటికి ఉండే వాస్తుదోషం తొలగిపోతుందంటారు. ప్రాణ ప్రతిష్ఠ సమయంలో ఇంట్లో కర్పూరం ధూపం పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఇళ్లంతా పవిత్రంగా ఉంటుందంటారు. దెయ్యాల వంటి శక్తులుంటే నాశనమౌతాయంటారు. ఉదయం, సాయంత్రం తప్పకుండా చేయాలి. మరీ ముఖ్యంగా రేపు ఇంట్లో రామాయణం పఠించాలి. హనుమాన్ చాలీసా సైతం పఠించాలి.
Also read: Famous Ram temples: అయోధ్యతో పాటు దేశంలో ప్రసిద్ధికెక్కిన రామాలయాలు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook