Ayodhya Ram Mandir: ఆరోజే అయోధ్య రాముని ప్రతిష్ట ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా..
Ayodhya Ram Temple Opening Date And Time: యావత్తు భారతదేశ ప్రజలు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి ముహుర్తం దగ్గర పడుతోంది. ఈ కార్యక్రమం కోసం లక్షలాది మంది ప్రజలు తరలిరానున్నారు. జనవరి 22న ప్రాణ ప్రతిష్ట చేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. అయితే ఈ రోజునే ఎందుకు ఎంపిక చేశారు..? జనవరి 22 తేది ప్రత్యేకత ఏంటి..?
Ayodhya Rama Temple Opening Date And Time: అయోధ్యను భారతీయులు రామ జన్మభూమిగా ఎందుకు పిలుస్తారు అంటే శ్రీరాముడు ఈ పట్టణంలో జన్మించడం వల్ల ఈ పేరు వచ్చిందని భావిస్తారు. అయితే ఇంతకుముందు ఈ స్థలంలో బాబ్రీ మసీదు ఉండేది. 1992లో కొంతమంది హిందూవులు ఈ మసీదును కూల్చివేశారు. దీంతో మసీదుపై సుప్రీంకోర్టులో తీర్పు వెల్లడించింది. అనంతరం కేంద్ర ప్రభుత్వం బాబ్రీ మసీదు స్థానంలో రామ మందిరాన్ని నిర్మించింది. ఈ రామ మందిరానికి సంబంధించి పనులు పూర్తి కావడంతో ఈ నెల 22వ తేదీన శ్రీరాముడు ఆలయంలో కొలువు తీరానున్నారు. శ్రీరాముని దర్శన ప్రక్రియను రామ జన్మభూమి ట్రస్ట్ జనవరి 22 ఉదయం 8 గంటల నుంచి ప్రారంభిస్తుంది. అయితే ఈ రోజు మాత్రమే శ్రీరాముడు విగ్రహ ప్రతిష్టను చేయబోతున్నారు? దీనికి కారణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Also read: Surya Guru Gochar 2024: 12 ఏళ్ల తర్వాత నవపంచం రాజయోగం.. ఈ 3 రాశులవారిపై డబ్బు వర్షం..
శ్రీరాముడు అభిజిత్ ముహూర్తంలో జన్మించారని హిందూ పురాణాలు చెబుతున్నాయి. ఈ అభిజిత్ మూహూర్తం అనేది ఉదయం 11.51 నుంచి 12:33 మధ్యాహ్నం వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు. అందుకే ఈ శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టను ఈ సమయంలో ప్రారంభిస్తున్నారు. అంతేకాకుండా హిందూ పంచాగ ప్రకారం జనవరి 22న మృగశిర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ నక్షత్రం ఎంతో పవిత్రమైనదిగా హిందూవులు భావిస్తారు. ఈ నక్షత్రంలో చేపట్టిన పనులు ఎంతో శుభప్రదం. అలాగే విజయాన్ని ప్రసాదిస్తుందని భారతీయుల నమ్మకం.
Also read: Budhaditya Raja Yoga: మరో 48 గంటల్లో ఈ 3 రాశుల దశ తిరగబోతుంది.. ఇక వీరికి అన్ని మంచి రోజులే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Faceboo