Ayodhya Rammandir: మరి కొద్దిరోజుల్లో అంటే జనవరి 22న రామాలయ ప్రతిష్ఠ జరగనుంది. దేశం నలమూలల్నించే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీగా భక్తులు తరలిరానుండటంతో పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ ప్రతిష్ఠ పురస్కరించుకుని మహా క్రతువు నిర్వహించనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జనవరి 22వ తేదీ 2024లో అయోధ్యలో శ్రీరామమందిరం భక్తుల సందర్శనార్ధం సిద్ధం కానుంది. ఆ రోజు నుంచి భవ్య రామమందిరంలో శ్రీరాముడు కొలువుదీరనున్నాడు. రామమందిరంలో రామ్‌లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించేందుకు శ్రీ రామజన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ పూర్తి ఏర్పాట్లు చేసింది. ప్రదాని మోదీ సహా ప్రముఖులంతా హాజరుకానున్నారు. రామమందిరంలో మొదటి అంతస్టు పూర్తి కావడంతో ఆలయ ప్రతిష్ఠ జరగనుంది. ఈ సందర్బంగా మహా క్రతువు కూడా తలపెట్టారు. దేశవ్యాప్తంగా పెద్దఎత్తున భక్తులు తరలిరానున్నారనే అంచనాల నేపధ్యంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. 


అయోధ్యకు మొదటి 100  రోజులు అంటే 2024 జనవరి 19 నుంచి 1000 ప్రత్యేక రైళ్లు నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ జరిగిన మరుసటి రోజు నుంచి ఆలయంలోని భక్తుల్ని అనుమతించనున్నారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, పూణే, కోల్‌కతా, నాగ్ పూర్, లక్నో, జమ్ము సహా దేశంంలోని అన్ని ప్రాంతాల నుంచి అయోధ్యకు రైళ్లు నడపనున్నారు. మరోవైపు అయోధ్య రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి. జనవరి 15 నాటికి పూర్తి కానున్నాయి.


రామ మందిరం ప్రారంభం సందర్భంగా కొన్ని రైళ్లను వివిధ యాత్రిక బృందాలు ఛార్టర్డ్ రైళ్లుగా బుక్ చేసుకున్నాయి. ఐఆర్సీటీసీ కూడా క్యాటరింగ్ సర్వీసులకు సిద్ధమౌతోంది. రాముడి జన్మస్థలాన్ని సందర్శించనున్న యాత్రికులకు పవిత్ర సరయూ నదిలో ఎలక్ట్రిక్ బోటు ప్రయాణం కల్పించారు. 


Also read: Grah gochar 2024: కొత్త సంవత్సరంలో ధనవంతులు కాబోతున్న రాశులివే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook