Guru Gochar 2024 Positive effect: జ్యోతిష్యశాస్త్రంలో దేవగురు బృహస్పతిని శుభగ్రహంగా భావిస్తారు. ఇతడిని అదృష్టం మరియు సంతానానికి కారకుడిగా భావిస్తారు. ప్రస్తుతం బృహస్పతి మేషరాశిలో సంచరిస్తున్నాడు. గురు గ్రహం మే 1, 2024 మధ్యాహ్నం 2:29 గంటలకు వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. అయితే రెండు రోజుల తర్వాత అంటే మే 03వ తేదీన రాత్రి 10:08 గంటలకు బృహస్పతి తిరోగమన స్థితిలోకి వెళతాడు. బృహస్పతి రాశి మార్పు వల్ల కొత్త సంవత్సరంలో ఏ రాశులవారికి అనుకూలంగా ఉంటుందో తెలుసుకుందాం.
వృశ్చిక రాశి
కొత్త సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి గురుడు అనుగ్రహం ఉండబోతోంది. దీంతో వీరు అనతి కాలంలోనే ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మీ వ్యాపారం విస్తరిస్తుంది. ఆదాయం భారీగా పెరుగుతుంది. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.
కుంభ రాశి
బృహస్పతి సంచారం వల్ల కుంభరాశి వారి జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు ఆర్థికంగా లాభపడతారు. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడతారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.
Also Read: Shukra Gochar: 2024లో ఈ 3 రాశులను వరించనున్న అదృష్టం.. ఇందులో మీ రాశి ఉందా?
మేష రాశి
బృహస్పతి రాశి మార్పు మేష రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. దీని కారణంగా న్యూ ఇయర్ లో మీ సంపద పెరుగుతుంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ రెట్టింపు అవుతుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. అప్పుల బాధ నుండి బయటపడతారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.
సింహ రాశి
గురుడు సంచారం కారణంగా 2024లో సింహరాశి వారు ప్రయోజనం పొందబోతున్నారు. మీకు స్థిర చరాస్తులు లభిస్తాయి. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు పెద్ద మెుత్తంలో ఆస్తిని కొనుగోలు చేస్తారు. మీరు రుణవిముక్తి పొందుతారు. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.
Also Read: Budh Gochar effect: 2024లో గ్రూప్ 2, డీఎస్సీ, సచివాలయ జాబ్స్ కొట్టబోయేది ఈ 3 రాశుల వారే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook