Ayodhya Rammandir: అయోధ్య రామమందిరం నిర్మాణానికి కొన్ని ఏళ్ల ముందే అంటే 34 ఏళ్ల క్రితమే ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో సాధువులు రామమందిరం మోడల్ ఆలయాన్నిసిద్ధం చేశారు. 34 ఏళ్ల క్రితం తయారు చేసిన మోడల్ ఆలయం ఇప్పుడు సాకారమైంది. మూడున్నర దశాబ్దాల క్రితమే రామమందిరం ఆలయ మోడల్ సిద్ధమైందన్నమాట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. 2019లో సుప్రీంకోర్టు తీర్పు అనంతరం 2020లో రామమందిరం నిర్మాణ పనులు ప్రారంభమైనా 1989లో అంటే 34 ఏళ్ల క్రితమే ఆయోద్య రామాలయం మోడల్ అప్పటి సాధు సంతువుల చేతుల్లో ప్రయాగ్ రాజ్‌లో సిద్ధమైంది. అప్పట్లో ఆ మోడల్‌ను ప్రతి ఇంటా పూజించారు. ఈ మోడల్ ఆధారంగానే శిలాన్యాస్ చేశారు. 


1989లో సిద్ధం చేసిన ఈ మోడల్‌లో కొన్ని మార్పులు చేశారు. 2020లో శిలాన్యాస్ తరువాత మోడల్‌లో మూడు అంతస్థులు చేశారు. అంతకుముందు రెండంతస్థుల్లో ఉండేది. ఇప్పుడు మూడు అంతస్థుల్లో ఉంటుంది. 1989 నాటి మోడల్ పొడవు 128 అడుగులు కాగా వెడల్పు 155 అడుగులుంది. ఇప్పుుడు పొడుగు 350 అడుగులు, వెడల్పు 250 అడుగులుంది. ఎత్తు 161 అడుగులు. మిగిలిన మోడల్ అంతా ఒకటే. సింహ ద్వారం, నృత్య మండపం, పవిత్ర గర్భగుడి, కీర్తన మండపం, సత్సంగ మండపం కూడా అన్నీ ఆ మోడల్‌లో ఉన్నట్టే ఉన్నాయి. 


కరసేవకపురంలో 2002 నుంచి అందుబాటులో ఉన్న మోడల్


రామమందిరం మోడల్‌ను 2001లో ప్రయాగరాజ్ కుంభ్ మేళాలో తొలిసారిగా ప్రదర్శించారు. భక్తులు ఈ మోడల్ రామాలయాన్ని సందర్శించసాగారు. కుంభమేళా ముగిసిన తరువాత కరసేవకపురంలోని ఓ భవనంలో ఉంచారు. ఇప్పుుడు అదే మోడల్ నిర్మాణమైంది. శ్రీరామ జన్మభూమి మందిరం మోడల్ పర్యవేక్షణను బాబా హజారీ దాస్ చూస్తున్నారు. 1990లో అయోధ్యకు వచ్చిన ఈయన ఇక్కడే ఉండిపోయారు. షాహ్ జహంపూర్‌కు చెందిన బాబా హజారీదాస్ బాబ్రీ మసీదు విధ్వంసం నుంచి రామాలయం నిర్మాణం వరకూ అంతా చూశారు. 1992లో బాబ్రీ విధ్వంసంలో ఆయనకు గాయాలయ్యాయి. 


Also read: Ys Jagan: వైఎస్ జగన్ ధీమాకు కారణమేంటి, అందుకే సీట్లు మారుస్తున్నారా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook