Ys Jagan: ఏపీ ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మూడు జాబితాలు ప్రకటించింది. నాలుగో జాబితాకు సిద్ధమౌతోంది. మరోవైపు ప్రతిపక్షాలు అన్నీ ఒక్కటౌతున్నా, అసంతృప్తులున్నా లెక్కచేయకుండా అభ్యర్ధుల్ని మార్చేస్తున్నారు. జగన్ ప్రదర్శిస్తున్న ధీమాకు కారణం అదేనని తెలుస్తోంది.
ఏపీలో మరోసారి అధికారం తనదే అనే ధీమలో ఉన్నారు వైఎస్ జగన్. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా, అధికార పార్టీని ఓడించడమే లక్ష్యంగా తెలుగుదేశం-జనసేన బరిలో నిలిచాయి. కొత్తగా కాంగ్రెస్ పార్టీ సైతం జగన్ చెల్లెలు షర్మిలను ఏపీలో బరిలో దించింది. ఇన్ని పరిణామాలు జరుగుతున్నా సరే వైఎస్ జగన్ మాత్రం టార్గెట్ 175 అంటున్నారు. అసంతృప్తులు వస్తున్నా, అభ్యర్ధులు పార్టీ మారుతున్నా లెక్కచేయకుండా మార్పులు చేర్పులు చేస్తున్నారు. గెలుపు గుర్రాలే లక్ష్యంగా అభ్యర్ధుల్ని ప్రకటిస్తున్నారు. వైఎస్ జగన్ ఈ ధీమాకు కారణం మాత్రం ఒక్కటేనంటున్నారు. అందుకే ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నాయంటున్నారు.
ఏపీలో ప్రస్తుతం పరిస్థితి పరిశీలిస్తే వైసీపీకు గ్రామీణ ప్రాంతాల్లో పట్టు ఎక్కువగా ఉంది. వాలంటీర్ వ్యవస్థతో సంక్షేమ పధకాలు ఇంటికే రావడం, అన్ని పనులు చేసి పెడుతుండటం, ఫ్యామిలీ డాక్టర్ వంటి పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో బాగా నాటుకుపోయాయని తెలుస్తోంది. అందుకే వివిధ సర్వేల్లో గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీకు పట్టు ఎక్కువగా ఉందని తేలింది. పట్టణ ప్రాంతాల్లో మాత్రం వైసీపీ వెనుకబడి ఉంది. సాధారణంగా ఏ ఎన్నికల్లో అయినా గ్రామీణ ప్రాంతాల్లో పట్టు ఉంటేనే మనుగడ సాధ్యమౌతుంది. రూలింగ్ కావాలంటే రూరల్ లో ఫ్యాన్ గట్టిగా తిరగాల్సిందే. ఇప్పుడు ఏపీలోని రూరల్‌లో ఫ్యాన్ గట్టిగానే తిరుగుతోంది.
అందుకే పట్టణ ప్రాంతాల్లో భారీగా మార్పులు చేర్పులు చేస్తున్నారు వైఎస్ జగన్. విజయవాడ సెంట్రల్, విజయవాడ వెస్ట్, చిలకలూరి పేట, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, అనకాపల్లి, చిత్తూరు పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే కొత్త ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. రాయదుర్గం, కళ్యాణదుర్గం, మంగళగిరి, ఆలూరు, ఎమ్మిగనూరు, పెనుకొండ ప్రాంతాల్లో కూడా మార్పులు చేశారు.
Also read: AP Caste Census 2024: ఏపీలో కులగణన రేపట్నించి ప్రారంభం, ఎలా జరుగుతుందంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook