Bakrid 2022: ముస్లింల ప్రధాన పండుగలలో బక్రీద్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఎంతో ఘనంగా ఈ ఫెస్టివల్ ను జరుపుకుంటారు. ఈ సంవత్సరం భారతదేశంలో జూలై 10న అంటే ఇవాళ బక్రీద్ (Bakrid 2022) జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఇస్లామిక్ క్యాలెండర్‌లోని చివరి నెల అయిన జు-అల్-హిజ్‌లో ఈ బక్రీద్ వేడుకను చేసుకుంటారు. దీనినే ఈద్-ఉల్-అధా లేదా ఖుర్బీనా పండుగ అని కూడా అంటారు. ఈ పండగను త్యాగానికి ప్రతీకగా జరుపుకుంటారు. పవిత్ర రంజాన్ మాసం ముగిసిన 70 రోజుల తర్వాత బక్రీద్ ను జరుపుకుంటారు. ఈనెలలోనే ముస్లింలు హజ్ యాత్రను చేస్తారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అల్లాహ్ ఆదేశం ప్రకారం హజ్రత్ ఇబ్రహీం తన కుమారుడిని బలి ఇవ్వడానికి సిద్దపడతాడు.ఆ క్షణంలో అల్లా తన దూతను పంపి అతడి కొడుకు స్థానంలో మేకను పెట్టాడని చెబుతారు. అప్పటి నుండి బక్రీద్ రోజున మేకను బలి ఇచ్చే సంప్రదాయం ప్రారంభమైంది. బలి అనంతరం ఆ మాంసాన్ని మూడు భాగాలు చేస్తారు. ఇందులో మొదటి భాగాన్ని బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరుగు వారికి అందజేస్తారు. రెండవ భాగం పేదల కోసం, చివరి మరియు మూడవ భాగం కుటుంబం కోసం ఉంచుకుంటారు. హజ్ యాత్రకోసం ముస్లింలందరూ సౌదీ అరేబియాలోని మక్కా  నగరానికి వెళ్తారు. ఈ ఏడాది ఇస్లామిక్ దేశాల్లో జూలై 9నే బక్రీద్ జరుపుకోనున్నారు. 


Also Read: Devshayani Ekadashi 2022: ఇవాళే తొలి ఏకాదశి... ఉపవాసం చేసేటప్పుడు ఇవి గుర్తించుకోండి!



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook