vastu tips for broom: సాధారణంగా ప్రతి ఇంట్లో ఉపయోగించే వస్తువుల్లో చీపురు (broom) కూడా ఒకటి. శుభ్రపరచడానికి ఉపయోగించే చీపురు గడ్డి, ప్లాస్టిక్, బిర్చ్ లేదా ఫైబర్తో తయారు చేయబడింది. చీపురుకు సంబంధించిన అనేక నియమాలు గ్రంథాలలో చెప్పబడ్డాయి. చీపురును ఇంటి గుమ్మం దగ్గర పెట్టుకోకూడదంటారు. చీపురుకు సంబంధించిన అలాంటి కొన్ని ప్రత్యేక నియమాలను తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చీపురు లక్ష్మికి చిహ్నం:
హిందూ మతంలో (Hinduism) చీపురు లక్ష్మీదేవీ చిహ్నంగా పరిగణించబడుతుంది. కావున పాత లేదా చెడ్డ చీపురును గురువారం లేదా శుక్రవారం ఇంటి నుండి బయటకు తీయకూడదు. ఎందుకంటే గురువారం, శుక్రవారం వరుసగా విష్ణువు మరియు లక్ష్మికి (Goddess Laxmi) సంబంధించినవి. ఈ రోజున, ఇంట్లో నుండి చీపురు తీసివేసిన తర్వాత కోపంతో లక్ష్మీ దేవి ఇంటి నుండి వెళ్లిపోతుంది. అంతే కాకుండా విష్ణుమూర్తి అనుగ్రహం కూడా లభించదు. మరోవైపు, చీపురుపై అడుగు పెట్టడం లేదా దాటడం చేయకూడదు. 


చీపురు కొనడానికి ఏ రోజు మంచిదంటే?
శాస్త్రాల ప్రకారం, మంగళవారం లేదా శనివారం చీపురు కొనడానికి ఉత్తమమైన మరియు పవిత్రమైన రోజు. ఇలా చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీనితో పాటు సంపద కూడా వస్తుంది. అంతే కాదు లక్ష్మి దేవి అనుగ్రహం కూడా ఉంటుంది.  కృష్ణ పక్షంలో (krishna paksh) చీపురు కొనడం వల్ల మంచి జరుగుతోంది.


చీపురు ఎక్కడ ఉంచాలి?
చీపురు ఇంట్లో ఎవరికీ కనిపించని ప్రదేశంలో ఉంచాలని శాస్త్రాలు చెబుతున్నాయి. చీపురు మంచం కింద అస్సలు ఉంచకూడదు. అదే సమయంలో, సూర్యాస్తమయం తర్వాత తుడవకూడదు. ఎందుకంటే అలా చేయడం వల్ల లక్ష్మీదేవి కోపం తెచ్చుకుని ఇంటిని వదిలి వెళ్లిపోతుందట.


Also Read: Shani Uday 2022: శని ఉదయించబోతున్నాడు.. రాబోయే 3 రోజుల్లో ఈ 3 రాశులవారికి రాజయోగం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి