Bhadrapada Month 2022: హిందూ క్యాలెండర్‌లోని ఆరో నెలను భాద్రపద మాసం అంటారు. ఈ మాసంలో శ్రీకృష్ణుడిని, గణేశుడిని పూజిస్తారు. ఈ దేవతామూర్తులిద్దరూ ఈ మాసంలో జన్మించారు. అందుకే ఈ మాసానికి అంత విశిష్టత. భాద్రపద మాసం సెప్టెంబరు 10 వరకు ఉంటుంది. ఈ నెలలో దానం,జపం, తపస్సుకు విశేష ప్రాధాన్యత ఉంది. పురాణాల ప్రకారం, శ్రీ కృష్ణుడికి నెమలి పించం (Peacock Feather) చాలా ఇష్టం. నెమలి పించానికి సంబంధించిన ఈ పరిహారాలు చేయడం ద్వారా మీ ఇల్లు అష్టఐశ్వర్యాలు, సుఖసంతోషాలతో కళకళ్లాడుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ పరిహారాలు చేయండి
>> శ్రీ కృష్ణుడికి ఇష్టమైన నెమలి పించంను తీసుకుని.. దానిపై నీళ్లు చల్లుతూ 21 సార్లు గ్రహ మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి. 


>> చెడు దృష్టి నుండి పిల్లలను రక్షించడానికి.. నెమలి పించంతో కూడిన వెండి హారతిని ధరించండి. 


>> ఇంటిలోని ప్రతికూలతలను తొలగించడానికి..ఆస్ట్రాలజీ ప్రకారం, ఇంటి ప్రధాన ద్వారంపై నెమలి పించంను ఉంచండి. ఇలా చేయడం వల్ల నెగెటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాదు. ఇందుకోసం మూడు నెమలి ఈకలను తీసుకుని 'ఓం ద్వారపాలాయ నమః జాగ్రే స్థాపయ స్వాహా' అనే మంత్రాన్ని రాసి గణేషుడి వద్ద ఉంచండి. 


>> మీకు శత్రువుల వల్ల ఇబ్బంది కలిగినా లేదా వారిని వదిలించుకోవాలనుకున్నా.. మంగళ, శనివారాల్లో మీ విరోధి పేరు నెమలి పించంపై కుంకుమతో రాయండి. మరుసటి రోజు లేచిన వెంటనే దానిని పారే నీటిలో విసిరేయండి. 


>>  మీరు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నట్లయితే, రాధా-కృష్ణుల ఆలయానికి వెళ్లి కిరీటంలో నెమలి పించంను ఉంచండి. అనంతరం 40 రోజుల తర్వాత దానిని తీసుకొచ్చి ఇంటి ఖజానా లేదా అల్మారాలో ఉంచండి. త్వరలో మీరు ఆర్థికంగా మెరుగుపడతారు.


(నోట్: ఇది సాధారణ ఊహలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని జీ న్యూస్ నిర్ధారించలేదు)


Also Read: Sankashti Chaturthi 2022: భాద్రపద సంకష్ట చతుర్థి ఎప్పుడు? పూజ ముహూర్తం తెలుసుకోండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook