Budh Dosh Remedies: మీరు బుధ దోషంతో బాధపడుతున్నారా? అయితే ఇలా చేయండి
Good Luck Tips: మీ జాతకంలో బుధుడు బలహీన స్థితిలో ఉన్నా లేదా బుధ దోషంతో బాధపడుతున్న బుధవారం నాడు ఈ పరిహారాలు చేయండి.
Budh Dosh Remedies: అందం, తెలివితేటలు, కమ్యూనికేషన్ మరియు ఏకాగ్రతకు కారుకుడు బుధుడు. ఎవరి జాతకంలో బుధుడు (Mercury Planet) శుభస్థానంలో ఉంటాడో ఆ వ్యక్తికి అన్ని విజయాలే లభిస్తాయి. ఏ వ్యక్తి కుండలిలో బుధుడు బలహీన స్థితిలో ఉంటాడో ఆ వ్యక్తి అనేక సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. ఈ వ్యక్తికి అదృష్టం కలిసి రాదు, ఆర్థికంగా కష్టాలు వెంటాడుతాయి, పనిలో అడ్డంకులు ఎదురువుతాయి. జాతకంలో బుధుడు బలపడాలన్నా, బుధ దోషం తొలగిపోవాలన్నా బుధవారం నాడు ఈ పరిహారాలు చేయండి.
జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే...
>> ఏ వ్యక్తి యొక్క జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే ఆ వ్యక్తి అప్పులపాలు అవుతాడు. దీంతో పాటు అతడు డబ్బు కొరతను ఎదుర్కోవల్సి ఉంటుంది.
>> మెర్క్యురీని గౌరవానికి కారకుడిగా భావిస్తారు. ఎవరి కుండలిలో బుధుడు బలహీన స్థితిలో ఉంటాడో ఆ వ్యక్తి కీర్తి ప్రతిష్టలను కోల్పోతాడు. అంతేకాకుండా అతడు చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కోంటాడు.
>> జాతకంలో బుధ దోషం ఉన్నవారు వ్యాపారం, ఉద్యోగాలలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవల్సి ఉంటుంది.
>> కుండలిలో బుధుడు అశుభస్థానంలో ఉన్న వ్యక్తి ఒత్తిడికి గురవుతాడు. అనారోగ్యం బారినపడే అవకాశం ఉంది.
జాతకంలో మెర్క్యురీని బలపరిచే పరిహారం
>> మీ జాతకంలో బుధ గ్రహం బలహీన స్థితిలో ఉంటే.. బుధవారం ఉపవాసం ఉండి...తులసి ఆకులతో గంగాజలం తీసుకోండి. ఈ రోజున రాగి పాత్రలు, ఆకుపచ్చ లేదా నీలం రంగు దుస్తులను దానం చేయడం మంచిది.
>> రత్న శాస్త్రం ప్రకారం, మీ చేతి వేలికి పచ్చని ధరించడం వల్ల మీ జాతకంలో బుధుడు బలపడతాడు.
>> బుధవారం నాడు ఓం బం బుధాయ నమః లేదా ఓం శ్రీం శ్రీం బుధాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
Also Read: Surya Gochar 2022: వృశ్చికరాశిలో సూర్య సంచారం... ఈ రాశులవారికి అపారమైన ప్రయోజనం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి