Budh Gochar 2023: తర్కం, మేధస్సు మరియు కమ్యూనికేషన్ కు బుధదేవుడిని కారకుడిగా భావిస్తారు. జనవరి 13న బుధగ్రహం ధనుస్సు రాశిలో ఉదయించనుంది. అనంతరం జనవరి 18న ధనుస్సు రాశిలో సంచరించనున్నాడు. ఫిబ్రవరి 7న ఈ రాశిని వదిలి మకరరాశిలో సంచరించనున్నాడు. బుధగ్రహం యొక్క ఈ కదలిక ప్రభావం దేశంపైనే కాకుండా మొత్తం ప్రపంచంపై కనిపిస్తుంది. జనవరి 13న ఉదయం 5.15 గంటలకు గ్రహాల రాజు బుధుడు బృహస్పతి రాశి ధనుస్సు రాశిలో ఉదయిస్తాడు. ధనుస్సు రాశిలో బుధుడు సంచరించడంతో 6 రాశులు జీవితాల్లో పెను మార్పు రానుంది. వీరు వ్యాపారం, వృత్తి రెండింటిలోనూ ప్రయోజనం పొందుతారు. ఆ లక్కీ రాశులేంతో తెలుసుకుందాం.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిధునరాశి (Gemini): మిథునరాశి వారి సప్తమంలో బుధుడు ఉదయిస్తాడు. దీంతో వ్యాపారులు భారీగా లాభాలను గడిస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. ఉద్యోగులకుఈ సమయం అద్భుతంగా ఉంటుంది. పెళ్లికాని వారికి  వివాహం కుదురుతుంది. కెరీర్ లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. 
సింహరాశి (Leo): సింహరాశికి ఐదవ ఇంట్లో బుధుడు ఉదయిస్తాడు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. సంతానం లేని వారికి పిల్లలు కలుగుతారు. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థుల కల నెరవేరుతుంది. స్టాక్స్ మరియు షేర్లలో పెట్టుబడి పెట్టిన వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. 
తులారాశి (Libra): తులారాశిలో మూడవ ఇంట్లో బుధుడు ఉదయిస్తాడు. ఈ రాశివారి వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది. కెరీర్ లో అపారమైన పురోగతిని సాధిస్తారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారం విస్తరిస్తుంది. 


వృశ్చిక రాశి (Scorpio): బుధుడి సంచారం ఈ రాశివారికి మేలు చేస్తుంది. మీరు వ్యాపారాన్ని విస్తరిస్తారు. మీకు గ్రహాల నుండి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. మీ ఆలోచనలను ప్రజలను అభినందిస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ సమయంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. 
ధనుస్సు రాశి (Sagittarius): ఈ రాశిలో బుధుడు ఉదయించబోతున్నాడు. మీరు జీవితంలో సానుకూల మార్పులను చూడవచ్చు. ఈ రాశిలో బుధుడు మొదటి ఇంట అంటే లగ్నంలో ఉదయించబోతున్నాడు. దీంతో మీరు కెరీర్ లో భారీ లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. మీ ఫ్యామిలీ సపోర్టు లభి్సతుంది. మీ లవ్ లైఫ్ బాగుంటుంది. 
కుంభ రాశి  (Aquarius): కుంభరాశి యెుక్క 11వ ఇంట్లో బుధుడు ఉదయిస్తాడు. దీంతో ఆఫీసులో మీకు కాలం కలిసి వస్తుంది. లైఫ్ పార్టనర్ తో కలిసి వ్యాపారం ప్రారంభించే అవకాశం ఉంది. మీ సంపదలో ఎక్కువ భాగం ఖర్చు చేస్తారు. మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. 


Also Read: Shani Asta 2023: కుంభరాశిలో అస్తమించనున్న శనిదేవుడు ... వీరికి భారీగా డబ్బు నష్టం... 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U      


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.