జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల రాశి పరివర్తనానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఏదైనా గ్రహం వక్రమార్గం అవుతుంటే లేదా మరో రాశిలో ప్రవేశిస్తుంటే దాని ప్రభావం ఇతర రాశులపై శుభంగానో అశుభంగానే పడుతుంటుంది. జ్యోతిష్యం ప్రకారం గ్రహాల రాజకుమారుడు బుధుడిని బుద్ధి, నిర్ణయ సామర్ధ్యం, తర్కం, గణితంకు కారకుడిగా భావిస్తారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ధనస్సు రాశిలో బుధుడు ప్రవేశిస్తున్నాడు. 12 రోజుల తరువాత అంటే ఫిబ్రవరి 7న మకరరాశిలో ప్రవేశిస్తాడు. మకరరాశి శనిగ్రహానికి చెందిన రాశి. ఫలితంగా కొన్ని రాశులకు బుధుడి ఈ గోచారం అత్యంత శుభసూచకం కానుంది. అటు కొన్ని రాశులకు సమస్యల్ని పెంచనుంది. బుధ గోచారం కారణంగా ఏయే రాశులకు అంతులేని ప్రయోజనాలు కలగనున్నాయో తెలుసుకుందాం. జ్యోతిష్యం ప్రకారం మకరరాశిలో బుధుడి ఫిబ్రవరి 7వ తేదీ ఉదయం 7 గంటల 38 నిమిషాలకు ప్రవేశించనున్నాడు. ఫిబ్రవరి 27 వరకూ ఇదే రాశిలో బుధుడు కొనసాగనున్నాడు. 


మేషరాశి


బుధుడి ఈ గోచారం మేషరాశి జాతకులకు అత్యంత శుభ సూచకంగా ఉంటుంది. మేషరాశి దశమభాగంలో బుధుడు ప్రవేశిస్తాడు. ఈ కాలంలో మేషరాశి వారు పనిచేసే చోట మంచి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. కుంటంబంతో గడిపేందుకు తగిన సమయం లభిస్తుంది. 


వృషభరాశి


బుధుడి గోచారం వృషభరాశి వారి ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. గ్రహాల రాజకుమారుడు వృషభరాశిలో 9వ భాగంలో సంచరిస్తాడు. ఈ కారణంగా నిలిచిపోయిన డబ్బులు తిరిగి చేతికి అందుతాయి. కుటుంబంతో ఏమైనా సమస్యలు లేదా విభేదాలుంటే తొలగిపోతాయి. పెట్టుబడి పెట్టేందుకు ఆలోచిస్తుంటే చాలా మంచి సమయం.


కర్కాటక రాశి


కర్కాటక రాశి 7వ భాగంలో బుధుడు సంచరించనున్నాడు. ఈ నేపధ్యంలో కర్కాటక రాశి జాతకులకు వ్యాపారంలో ప్రయోజనం సిద్ధిస్తుంది. సోదర సోదరీమణుల మధ్య సంబంధాలు బాగుంటాయి. సమాజంలో కీర్తి లభిస్తుంది. 


కన్యారాశి


కన్యారాశి వారికి బుధుడి గోచారం శుభదాయకం. బుధుడు ఈ రాశి 5వ భాగంలో గోచారం చేయనుంది. సంతానంతో ఎక్కువ సమయం గడుపుతారు. ఒకవేళ కొత్త ఉద్యోగం కోసం అణ్వేషిస్తుంటే విజయం లభిస్తుంది. షేర్ మార్కెట్‌లో పెట్టిన పెట్టుబడి లాభాల్నిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమౌతున్న విద్యార్ధులకు ప్రయోజనం కలుగుతుంది. 


తుల రాశి


బుధుడి గోచారం తులరాశి వారికి ఆనందం తీసుకొస్తోంది. బుధుడు ఈ రాశి 4వ భాగంలో గోచారం చేస్తాడు. తుల రాశి జాతకులకు అదృష్టం పూర్తిగా తోడవుతుంది. పనిచేసే చోట బాస్ మీ పట్ల ఆనందంగా ఉంటాడు. కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. తల్లి ఆరోగ్యంపై మాత్రం కాస్త శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. 


కుంభ రాశి


బుధుడి గోచారం ఈ రాశి 12వ భాగంలో ఉంటుంది. కుంభ రాశివారికి ఆదాయపు కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. విదేశాలకు వెళ్లే సమయం సమీపిస్తుంది. స్నేహితులు, కుటుంబసభ్యుల సహాయంతో ప్రతిరంగంలో విజయం సాధిస్తారు. 


Also read: Shani Asta 2023: శని అస్థిత్వం ప్రభావంతో..ఆ మూడు రాశులకు జనవరి 30 నుంచి డబ్బే డబ్బు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook