Mercury Transit in Gemini June 24th 2023: గ్రహాలు నిర్ధిష్ట సమయం తర్వాత రాశులను మారుస్తాయి. తెలివితేటలు మరియు వ్యాపారానికి కారకుడైన బుధుడు ఇవాళ తన సొంత రాశి అయిన మిథునరాశిలో సంచరించనున్నాడు. మెర్క్యూరీ ఇదే రాశిలో జూలై 08 వరకు ఉండనున్నాడు. బుధుడి సంచారం ప్రభావం మెుత్తం 12 రాశిచక్రాలపై కనిపిస్తుంది. మిథునరాశిలో మెర్క్యూరీ గోచారం ఏయే రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింహరాశి 
బుధుడి గోచారం సింహరాశి వారిని ఆర్థికంగా బలోపేతం  చేస్తుంది. మీకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. పెట్టుబడుల ద్వారా లాభం ఉంటుంది. మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల్లో మంచి పురోగతి సాధిస్తారు. 


కన్య రాశి
కన్యా రాశి వారికి బుధ సంచారం అనుకూల ఫలితాలు ఇస్తుంది. మీ వ్యాపారం విస్తరిస్తుంది. అంతేకాకుండా మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. నిర్ణయాలన్నీ మీకు అనుకూలంగా వస్తాయి. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. 


Also Read: Planet transit 2023: మరో ఆరు రోజుల తర్వాత ఈ 4 రాశులకు సుడి తిరగనుంది.. ఇందులో మీరున్నారా?


వృషభం 
మిథునరాశిలో బుధుడు సంచారం వృషభరాశి వారికి మేలు చేస్తుంది. మీరు మంచి ఫలితాలను పొందుతారు. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా పొందే అవకాశం ఉంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్నది సాధిస్తారు. 


మిధునరాశి
మెర్క్యూరీ రాశి మార్పు మిథునరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈసమయంలో మీరు శుభవార్తలు వింటారు. రాబోయే 14 రోజులు మీకు కలిసి వస్తాయి. మీరు కెరీర్ లో ముందుకు సాగుతారు. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. రచన, కళ, మీడియా రంగాలతో సంబంధం ఉన్నవారు ప్రయోజనం పొందుతారు.


Also Read: Vakri Shani 2023: త్రికోణ రాజయోగంతో ఈ 5 రాశులవారికి లాభాలే లాభాలు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook