Saturn Retrograde in Aquarius 2023 makes Kendra Trikon Rajyog: మనం చేసే మంచి చెడులను బట్టి ఫలాలను ఇచ్చే దేవుడు శని. అందుకే ఇతడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. సాధారణంగా గ్రహాల తిరోగమనం చెడు ఫలితాలనే ఇస్తుంది. ఇటీవల శనిదేవుడు కుంభరాశిలో తిరోగమనం చేశాడు. నవంబరు 04 వరకు శని ఇదే రాశిలో ఉండనున్నాడు. దీని కారణంగా కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడనుంది. నాలుగు నెలల ఈ సమయం కొన్ని రాశులవారికి ఇబ్బందికరంగా, మరికొన్ని రాశులవారికి అనుకూలంగా ఉండనుంది. తిరోగమన శని ఏయే రాశులవారికి ప్రయోజనాలు ఇస్తుందో తెలుసుకుందాం.
మేషం: శని తిరోగమనం మేషరాశి వారికి అపారమైన ప్రయోజనాలను ఇస్తుంది. మీ స్థిర చరాస్తులు పెరుగుతాయి. మీ ఆదాయం డబల్ అవుతుంది. మీరు ఆర్థికంగా లాభపడతారు. మీ సమస్యలన్నీ దూరమవుతాయి. మీరు ఉద్యోగ మరియు వ్యాపారాల్లో లాభపడతారు.
వృషభం: తిరోగమన శని కారణంగా ఏర్పడిన కేంద్ర త్రికోణ రాజయోగం వృషభ రాశి వారికి కలిసి వస్తుంది. మీకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. మీ జీవితంలో పెను మార్పులు వస్తాయి. మీ బాధ్యతలు పెరుగుతాయి. మీ జీతం పెరుగుతుంది.
మిథునం: శని తిరోగమనం మిథునరాశి వారికి భారీగా లాభాలను ఇస్తుంది. మీరు విదేశాలకు వెళ్లే అవకాశంఉంది. ఉద్యోగ మరియు వ్యాపారంలో లాభం ఉంటుంది. మీరు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది.
Also Read: Budh Gochar 2023: రేపు మిథునరాశిలోకి బుధుడు.. ఈ 5 రాశుల వారికి లాభాలు షురూ..!
సింహం: శని రివర్స్ కదలిక సింహరాశి వారికి ఆర్థిక ప్రయోజనాలను ఇస్తుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. బిజినెస్ లో పెద్ద డీల్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. పెట్టుబడి ద్వారా లాభం ఉంటుంది.
మకరం: శని వ్యతిరేక కదలిక మకర రాశి వారికి మేలు చేస్తుంది. మీకు వివిధ వనరుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీ ఐశ్వర్యం పెరుగుతుంది.
Also Read: Grah Gochar 2023: జూలై మొదటి వారంలో ఈ గ్రహాల గమనంలో పెను మార్పు.. ఈ 3 రాశులకు మంచి రోజులు మెుదలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook