COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Budh Gochar 2024 In Telugu: జ్యోతిష శాస్త్రంలో బుధ గ్రహానికి ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే ఈ గ్రహాన్ని అన్ని గ్రహాలకు యువరాజుగా భావిస్తారు. అలాగే దీనిని విజయం సంతృప్తి ఆరోగ్యంతో పాటు సంపదకు చిహ్నంగా పరిగణిస్తారు. అందుకే ఈ గ్రహం సంచారం చేసిన ప్రతిసారి 12 రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. ఈ ప్రభావం కారణంగా కొంతమందికి అదృష్టం లభిస్తే మరికొంతమందికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే జూలై 19వ తేదీన బుధుడు సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇలా సింహరాశిలోకి సంచారం చేయడం కారణంగా మొత్తం నాలుగు రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. ఈ ప్రభావంతో కొన్ని రాశుల వారు శుభవార్తలు వినడమే కాకుండా అదృష్టాన్ని కూడా పొందుతారు.


మేష రాశి: 
బుధ గ్రహ సంచారంతో మేష రాశి వారికి అన్ని రంగాల నుంచి లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి లభించి అద్భుతమైన శక్తిని పొందుతారు. అలాగే భాగస్వామ్య జీవితం గడుపుతున్న వారు భార్యతో మంచి సమయాన్ని గడపడం వల్ల మాధుర్యమైన సమయం ఏర్పడుతుంది. అలాగే ఆర్థికంగా చూస్తే ఈ రాశి వారికి గతంలో కంటే కాస్త సంపాదన మెరుగుపడే అవకాశాలున్నాయి. దీనికి కారణంగా పొదుపు కూడా పెరగవచ్చు. ఇక ఉద్యోగాలు చేస్తున్న వారి విషయానికొస్తే ఇంక్రిమెంట్స్‌తో పాటు ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. దీంతోపాటు జీవితంలో సంతృప్తి కూడా లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 


మిథున రాశి: 
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు సంచారం చేయడం కారణంగా మిథున రాశి వారిపై కూడా ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. దీని కారణంగా వీరికి మంచి సమయం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్స్ లో భాగంగా ఇంక్రిమెంట్స్ లెటర్స్ కూడా పొందుతారు. అలాగే ప్రమోషన్స్ కారణంగా ఇతర ప్రదేశాలకు కూడా బదిలీ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక కెరీర్ పరంగా చూస్తే ఈ సమయం ఎంతో బాగుంటుంది. అలాగే ఈ రాశి వారు ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే కుటుంబ సభ్యులతో కూడా చాలా ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా సమాజంలో పనులు చేస్తున్నవారు కూడా మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. అంతేకాకుండా ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధిస్తారు. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


తులారాశి:
బుధుడి సంచార ప్రభావం తులా రాశివారిపై కూడా పడుతుంది. ఈ సమయంలో వీరికి గౌరవం పెరగడంతో పాటు గతంలో పెట్టుబడుల నుంచి అకస్మాత్తుగా ధన లాభాలు పొందుతారు. దీంతో పాటు ఆర్థికంగా కూడా వీరికి ఈ సమయం చాలా బాగుంటుంది. దీంతో పాటు అనేక ప్రయోజనాలు కూడా పొందే ఛాన్స్‌లు ఉన్నాయి. ఆస్తుల పరంగా కూడా అనేక లాభాలు పొందుతారు. ఈ సమయంలో ఖర్చులు పూర్తిగా తగ్గి పొదుపు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో కలసి విహార యాత్రలకు వెళ్లే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. దీంతో పాటు ఇంట్లో ఆనందం పెరుగుతుంది. అలాగే వీరు ఎంతో ఆనందంగా ఉంటారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి