Budh Gochar Effects In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం త్వరలోనే బుధు రాశి సంచారం చేయబోతున్నాడు. అయితే ఈ గ్రహం ప్రతి నెల ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంది. ఇలా సంచారం చేయడం వల్ల ప్రతి నెల అన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే మే 31 తేదిన బుధుడు చేయబోయే సంచారం కారణంగా కూడా అన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడబోతోంది. బుధుడు రాశి మారడం కారణంగా ఈ గ్రహం అశుభ స్థానంలో ఉన్న రాశులవారికి అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ కింది 3 రాశులవారైతే విపరీతంగా నష్టపోయే ఛాన్స్‌ కూడా ఉందని జ్యోతిష్యలు తెలుపుతున్నారు.     అయితే ఈ గ్రహ సంచారంతో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిథునరాశి: 
మిథున రాశి వారికి బుధ సంచారం వల్ల ఎన్నో రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ రాశివారికి ఆర్థికంగా అనేక సమస్యలు రావచ్చు. అంతేకాకుండా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల తీవ్రంగా కూడా నష్టపోతారు. కాబట్టి ఈ సమయంలో పలు రకాల జాగ్రత్తలు పాటించడం ఎంతో మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే ఈ సమయంలో వీరు ఎలాంటి పనులు చేసిన తీవ్ర అడ్డంకులు వస్తాయి. అంతేకాకుండా మానసిక ఆరోగ్యం పరంగా కూడా అనేక సమస్యలు వచ్చే ఛాన్స్‌ ఉంది. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 


తుల రాశి: 
బుధ గ్రహ సంచార ప్రభావం తుల రాశి వారిపై కూడా పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతన్నారు. దీని కారణంగా వీరికి కూడా అనేక సమస్యలు రావచ్చు. అంతేకాకుండా మీ శత్రులువు హాని కలిగించే ఛాన్స్‌ కూడా ఉంది. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. రహస్య మీ శత్రువులు మీపై దాడి చేసే ఛాన్స్ కూడా ఉంది. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా కుటుంబ జీవితంలో కూడా అనేక సమస్యలు వస్తాయ.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


వృశ్చిక రాశి: 
వృశ్చిక రాశికి కూడా ఈ సమయంలో అనేక సమస్యలు వస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులు కలడమే కాకుండా అనేక సమస్యలు రావచ్చని జ్యోతిష్యలు చెబుతున్నారు. అలాగే ఈ సమయంలో కష్టపడి కూడా పని చేయాల్సి ఉంటుంది. ఉద్యోగాలు చేసేవారు ఎంత కష్టపడి పనులు చేసిన ఆశించిన ఫలితాలు లభించకపోయే ఛాన్స్‌ కూడా ఉంది. అంతేకాకుండా ఎలాంటి పనులు చేసిన చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి అన్ని విషయాల్లో జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవడం మంచిది. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి