Budh Mahadasha Effects:  జ్యోతిషశాస్త్రంలో బుధుడిని గ్రహాల యువరాజు అని పిలుస్తారు. సాధారణంగా బుధదేవుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారడానికి 25 రోజులు పడుతుంది. మేధస్సు, తార్కిక సామర్థ్యం, ​​నైపుణ్యానికి కారకుడిగా బుధుడిని భావిస్తారు. ఆస్ట్రాలజీలో బుధుని మహాదశ శుభప్రదంగా భావిస్తారు. మెర్క్యూరీ యెుక్క ఈ మహాదశ ప్రతి వ్యక్తిపై 17 సంవత్సరాలు ఉంటుంది. ఎవరి జాతకంలో బుధుడు శుభస్థానంలో ఉంటాడో వారికి దేనికీ లోటు ఉండదు. ఏ వ్యక్తి కుండలిలో మెర్క్యూరీ అశుభస్థానంలో ఉంటాడో వారి జీవితం అల్లకల్లోలం అవుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధన లాభం
బుధ మహాదశలో బుధుడు అంతర్దశ ఉన్నపుడు వ్యక్తిలో మతపరమైన ధోరణి పెరుగుతుంది. ప్రతి పనిని ఏకాగ్రతతో చేయడం ప్రారంభిస్తారు. బుధుని అనుగ్రహంతో అతడు పండితులు లేదా మంచి మేధస్సు ఉన్న వ్యక్తి అవుతాడు. డబ్బు సంబంధిత సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. అతడికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. 


బుధుని మహాదశలో అంతర్దశ
బుధ మహాదశలో సూర్యుని అంతర్దశ ఉన్నప్పుడు మానవునికి పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, చంద్రుడు ఉప కాలంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతాడు. మనస్సు సృజనాత్మక పనులలో నిమగ్నమై ఉంటుంది. కుటుంబంతో సత్సంబంధాలు ఏర్పడతాయి. శుక్రుని అంతర్దశ ఆ వ్యక్తికి మంచి ఆర్థిక ప్రయోజనాలను ఇస్తుంది. జీవిత భాగస్వామితో మధురమైన సంబంధాలు ఏర్పడతాయి. బృహస్పతి అంతర్దశ కూడా మనిషికి చాలా మేలు చేస్తుంది. ఈ సమయంలో మానసిక ప్రశాంతత లభిస్తుంది.


Also Read: మరో 5 రోజుల్లో ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే.. ఇందులో మీరున్నారా? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook