Budh Gochar 2022: త్వరలో అరుదైన యోగాన్ని చేయబోతున్న బుధుడు... మారనున్న ఈ 3 రాశులవారి ఫేట్..
Budh Gochar 2022: త్వరలో బుధ గ్రహం ధనుస్సు రాశిలో సంచరించబోతోంది. దీని కారణంగా అరుదైన భద్ర రాజయోగం ఏర్పడబోతుంది. ఇది మూడు రాశులవారికి అపారమైన ప్రయోజనాలను ఇవ్వనుంది.
Budh Planet Transit In Sagittarius: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఒక గ్రహం తన రాశిని మార్చినప్పుడల్లా.. దాని ప్రభావం ప్రజలందరిపై ఉంటుంది. బుద్ధి, కమ్యూనికేషన్ కు కారకుడైన బుధుడు వచ్చే నెలలో తన రాశిని మార్చనున్నాడు. డిసెంబరు 03న బుధుడు ధనుస్సు రాశిలో సంచరించనున్నాడు. దీని కారణంగా 'భద్రరాజయోగం' (Bhadra RajYog) ఏర్పడబోతుంది. ఈయోగం వల్ల మూడు రాశులవారు లాభపడనున్నారు. ఇది వ్యాపారం మరియు వృత్తిలో విజయాన్ని ఇస్తుంది.
కుంభం (Aquarius): కుంభ రాశి వారికి భద్ర రాజయోగం లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే బుధ గ్రహం మీ రాశి నుండి 11వ ఇంట్లో సంచరించబోతున్నారు. దీంతో మీ ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో భారీగా లాభాలు ఉంటాయి. రాజకీయాల్లో ఉన్నవారికి మంచి పదవి దక్కే అవకాశం ఉంది. మీరు స్టాక్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీలలో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనం పొందుతారు.
మీనం (Pisces): భద్ర రాజయోగం వృత్తి మరియు వ్యాపార పరంగా మీకు అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే బుధ గ్రహం మీ రాశి నుండి 10వ ఇంట్లో సంచరించబోతోంది. ఈ సమయంలో మీరు కొత్త జాబ్ ఆఫర్ పొందే అవకాశం ఉంది. అలాగే మీకు ఉద్యోగంలో ఇంక్రిమెంట్ మరియు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు వ్యాపారులు అధిక లాభాలను ఆర్జిస్తారు.
మేషం (Aries): భద్ర రాజయోగం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి తొమ్మిదవ ఇంట్లో బుధ గ్రహం సంచరించబోతోంది. దీంతో మీ అదృష్టం ప్రకాశించబోతుంది. చదువు లేదా కెరీర్ కారణంగా విదేశాలకు కూడా వెళ్లవచ్చు. పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పచ్చరాయిని ధరించడం వల్ల మీకు మేలు జరుగుతుంది.
Also Read: Chaturgrahi Yog 2022: వృశ్చికరాశిలో అరుదైన యోగం.. ఈ 3 రాశుల కెరీర్ అద్భుతం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook