Budh Rashi Parivartan 24th June: మిథునరాశిలో బుధ సంచారం.. కొన్ని రాశులకు శుభం.. మరికొన్ని రాశులకు అశుభం!

Budh Gochar 2023: ఈరోజు బుధుడు మిథునరాశిలోకి వెళ్లబోతున్నాడు. మెర్క్యూరీ సంచారం కొన్ని రాశులవారికి శుభప్రదంగా.. మరికొన్ని రాశులవారికి అశుభకరంగా ఉంటుంది. బుధుడి సంచారం ఏయే రాశులవారిని ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం.
Mercury Transit 2023 effect in Telugu: ఇవాళ అంటే జూన్ 24న గ్రహాల రాకుమారుడైన బుధుడు మిథునరాశిలో సంచరించబోతున్నాడు. ఈ మెర్క్యూరీ సంచారం కొందరికి శుభ ఫలితాలను ఇస్తే.. మరికొందరికి అశుభ ఫలితాలను ఇస్తుంది. మిథునరాశిలో బుధ గ్రహ సంచారం మెుత్తం 12 రాశులవారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో తెలుసుకుందాం.
మేషరాశి:
బుధుడి సంచార సమయంలో మీరు మీ సీనియర్లతో మంచి సంబంధాలను కొనసాగించండి. ఆఫీసులో మీ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. మీరు కెరీర్ చాలా మార్పులకు లోనవుతుంది. మీ ఖర్చులు పెరుగుతాయి. అంతేకాకుండా మీరు శుభవార్తలు కూడా ఉంటారు. ఫ్రెండ్స్ సపోర్టు లభిస్తుంది.
వృషభం:
మెర్క్యూరీ సంచారం వల్ల ఆఫీసులో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. వ్యాపారం విస్తరిస్తుంది. మీరు భారీగా డబ్బు సంపాదించే అవకాశం ఉంది. మీరు జాబ్ ఛేంజ్ అయ్యే అవకాశం ఉంది.
మిధునరాశి:
మిథున రాశి వారు ఈ కాలంలో చాలా సంతోషంగా ఉంటారు. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. ఉద్యోగస్తులపై అదనపు పని భారం పడవచ్చు. ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లాల్సి రావచ్చు.
కర్కాటక రాశి:
మెర్క్యురీ సంచార సమయంలో మీ ఆదాయం పెరుగుతుంది. మీరు పరీక్ష లేదా ఇంటర్వ్యూలో విజయం సాధించే అవకాశం ఉంది.
సింహరాశి:
బుధ సంచారం వల్ల మీ డబ్బు రెట్టింపు అవుతుంది. వ్యాపారులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోండి. కుటుంబ సభ్యులతో విభేదాలు రావచ్చు. ఉద్యోగం సాధించాలనే మీ కోరిక నెరవేరుతుంది.
కన్య రాశి:
మెర్క్యూరీ గోచారం సమయంలో మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ప్రయాణం చేసే అవకాశం ఉంది. మీరు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు.
తులారాశి:
కుటుంబంలో అనవసర వివాదాలకు తావివ్వకండి. మీరు కష్టపడి పని చేయడం ద్వారా ప్రయోజనం పొందుతారు. మీ జీవిత భాగస్వామికి ప్రాధాన్యత ఇవ్వండి.
Also Read: Vakri Shani 2023: త్రికోణ రాజయోగంతో ఈ 5 రాశులవారికి లాభాలే లాభాలు..!
వృశ్చికరాశి
ఈ రాశి వారు కుటుంబ సమస్యలను ఎదుర్కొంటారు. దీని వల్ల మీరు ఇబ్బంది పడతారు. వ్యాపారస్తులకు ఆకస్మిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి.
ధనుస్సు రాశి
మెర్క్యురీ ట్రాన్సిట్ కారణంగా మీరు మీ కెరీర్‌లో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరగవచ్చు. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది.
మకరరాశి
మీ ఖర్చులు అధికంగా ఉంటాయి. దీనివల్ల మీరు ఇబ్బందుల్లో పడతారు. ఉద్యోగం మారే అవకాశం ఉంది. కుటుంబ సమేతంగా తీర్థ యాత్రలకు వెళ్లవచ్చు.
కుంభ రాశి
ఈ సమయంలో మీరు కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది. సంబంధం మునుపటి కంటే బలంగా మారుతుంది.
మీన రాశి
బుధ సంచారము వల్ల మీరు పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందుతారు. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆస్తి, ధనం పెరుగుతాయి. కెరీర్‌లో ముందుకు సాగుతారు. వేరే ప్రదేశానికి ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంది. ఖర్చులను అదుపులో ఉంచుకోండి.
Also Read: Ketu Gochar 2023: కన్యా రాశిలోకి వెళ్లనున్న కేతువు.. ఈ 3 రాశులపై డబ్బు వర్షం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook