Ketu Gochar 2023: కేతువు రాశి మార్పు.. ఈ 3 రాశులపై కనక వర్షం పక్కా!

Ketu Gochar 2023:  త్వరలో కేతువు తన రాశిని మార్చనున్నాడు. అక్టోబరులో తుల రాశి నుండి కన్యా రాశిలోకి ప్రవేశించనున్నాడు. కేతు సంచారం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 25, 2023, 08:34 PM IST
Ketu Gochar 2023: కేతువు రాశి మార్పు.. ఈ 3 రాశులపై కనక వర్షం పక్కా!

Ketu will Transit in Virgo 2023: జ్యోతిష్య శాస్త్రంలో కేతువును దుష్ట గ్రహం, అపవిత్ర గ్రహంగా భావిస్తారు. ప్రస్తుతం తులారాశిలో ఉన్న కేతువు అక్టోబర్‌లో కన్యారాశిలోకి వెళ్లనున్నారు. కర్మ  గ్రహంగా భావించే కేతువు రాశి మార్పు మెుత్తం 12 రాశులవారిపై ఉంటుంది. రాహు, కేతు గ్రహాలు ఎల్లప్పుడూ తిరోగమనంలో ఉంటాయి. కేతు తిరోగమనం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం. 

వృషభం
కన్యారాశిలో కేతువు సంచరించడం వల్ల వృషభ రాశి వారు విజయాలు సాధిస్తారు. మీ జాతకంలో ఐదో ఇంట్లో కేతువు కూర్చున్నాడు. మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. మీరు ఆర్థికంగా బలపడతారు. మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీ మానసిక ఒత్తిడికి దూరమయ్యే అవకాశం ఉంది. మీ రాబడి పెరుగుతుంది. మెుత్తానికి ఈ సమయం బాగుంటుంది. 

సింహరాశి 
సింహ రాశి వారికి కేతువు సంచారం చాలా అదృష్టమనే చెప్పాలి. మీ జాతకంలో రెండవ ఇంట్లో కేతువు సంచారం జరగబోతోంది. అప్పుగా ఇచ్చిన లేదా ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఇతరులతో సంబంధాలు మెరుగుపడతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ మాటలతో ప్రజలను ఆకట్టుకుంటారు. ధనం పెరుగుతుంది. 

Also Read: Sawan 2023 Rashifal: జూలై 4 నుంచి శ్రావణ మాసం.. 2 నెలలపాటు ఈ 5 రాశులపై నోట్ల వర్షం..

ధనుస్సు రాశి
కేతువు రాశి మార్పు కన్యారాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీరు కెరీర్‌లో ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. ఉద్యోగస్తులు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీరు ఉద్యోగ, వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. బిజినెస్ విస్తరిస్తుంది. మీకు డబ్బుకు లోటు ఉండదు. ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. జాబ్ చేసేవారికి మరిన్ని మంచి అవకాశాలు వస్తాయి. 

Also Read: Jupiter transit 2023: వచ్చే 156 రోజులపాటు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. మీ రాశి ఉందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News