Astrology: మరి కొన్ని రోజుల్లో రాశి మారనున్న బుధుడు-శుక్రుడు.. ఇక ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారమే..!
Grah Gochar 2024: వచ్చే నెలలో బుధుడు మరియు శుక్రుడు గమనంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి. దీని కారణంగా కొందరి జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయి. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Budh-shukra gochar 2024 effect: గ్రహాల కదలిక ప్రజలందరి జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతుంది. మరికొన్ని రోజుల్లో బుధుడు, శుక్రుడు తమ రాశులను మార్చబోతున్నాయి. మార్చి 07న బుధుడు మీనరాశిలోకి, అదే రోజు శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశించనున్నారు. ఈ రెండు గ్రహాల రాశి మార్పు కొందరి తలరాతను మార్చబోతుంది. బుధ, శుక్ర గ్రహాల గమనంలో మార్పు ఏయే రాశులవారికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం.
కన్య - బుధుడు మరియు శుక్రుడు రాశిలో మార్పు కన్యారాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీరు డబ్బును ఆదా చేస్తారు. మీరు ఉద్యోగం ఛేంజ్ అవ్వడానికి ఇదే మంచి సమయం. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు కెరీర్ లో మంచి పొజిషన్ కు వెళతారు. మీకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది.
మిథునం- గ్రహాల సంచారం వల్ల మిథునరాశి వారు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభాలను పొందుతారు. మీకు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్టు లభిస్తుంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీరు పేదరికం నుండి బయటపడతారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది.
వృషభం - శుక్రుడు, బుధ గ్రహాల రాశి మార్పు వృషభరాశి వారికి అదృష్టాన్ని ఇవ్వబోతుంది. మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులు లాభపడతారు. మీరు ఉద్యోగ నిమిత్తం వేరే ప్రదేశానికి వెళ్లే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. మీ బిజినెస్ వృద్ధి చెందుతుంది. ఆఫీసులో మీకు సహచరుల సపోర్టు లభిస్తుంది.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Shani dev: త్వరలో ఉదయించబోతున్న శని.. ఈ 3 రాశులవారి జీవితం గందరగోళం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter