Budh Uday 2023: ఉదయించబోతున్న గ్రహాల యువరాజు.. ఈ 3 రాశులకు లక్కే లక్కు..
Mercury rise 2023: మే 14న బుధుడు ఉదయించబోతున్నాడు. మెర్క్యూరీ రైజింగ్ వల్ల మూడు రాశులవారు లాభపడనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Budh Uday 2023 effect: జ్యోతిషశాస్త్రంలో బుధుడిని గ్రహాల యువరాజు అంటారు. ప్రస్తుతం మెర్క్యూరీ మేషరాశిలో సంచరిస్తున్నాడు. ఈ నెల 14న బుధుడు ఉదయించబోతున్నాడు. సాధారణంగా గ్రహాల ఉదయం శుభఫలితాలను ఇస్తే.. గ్రహాల అస్తమయం అశుభఫలితాలను ఇస్తుంది. మే 14న బుధుడు ఉదయించడం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
1. మేషం
మేష రాశి వారికి ఉదయించే బుధుడు శుభ ఫలితాలను ఇస్తాడు. దీంతో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. దాంపత్య జీవితం అద్భుతంగా ఉండబోతుంది. వ్యాపారులు లాభపడతారు. మీకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ హెల్త్ బాగుంటుంది. మీ ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది.
3. సింహం
బుధుడు ఉదయించడం వల్ల సింహ రాశి వారు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీరు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మీరు శుభకార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది.
Also read: Daridra Yog effect: 'దారిద్య్ర యోగం' చేయబోతున్న కుజుడు... ఈ 3 రాశులకు కష్టాలు షురూ..
2. కర్కాటకం
కర్కాటక రాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు కెరీర్‌లో మంచి పురోగతి సాధిస్తారు. వ్యాపారులు చాలా లాభాలను పొందుతారు. ఆదాయం డబల్ అవుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. విదేశాలకు వెళ్లాలనే మీ కోరిక నెరవేరుతుంది.
Also Read: Grah Gochar 2023: మే నెలలో ఏయే గ్రహాలు రాశులను మార్చనున్నాయో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook