Budh Uday 2024 Tomorrow: సూర్యభగవానుడికి అతి దగ్గరగా గల గ్రహం బుధుడు. అందుకే ఇతడిని గ్రహాల రాకుమారుడు అని పిలుస్తారు. ఇతడు తెలివితేటలు మరియు కమ్యూనికేషన్ కు కారకుడిగా భావిస్తారు. రేపు బుధుడు మీనరాశిలో ఉదయించబోతున్నాడు. ఇప్పటి వరకు అస్తమయ స్థితిలో ఉన్న బుధుడు మార్చి 15న పెరగనున్నాడు. బుధ గ్రహం యెుక్క కదలికలు కారణంగా నాలుగు రాశుల వారు ప్రయోజనం పొందబోతున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిథున రాశి
బుధుడు ఉదయించడం వల్ల మిథునరాశి వారు చాలా లాభాలను పొందుతారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జాబ్ వస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. 
సింహ రాశి
మీనరాశిలో మెర్క్యూరీ సంచారం సింహరాశి వారికి మంచి రోజులు మెుదలవుతాయి. మీరు టేకాప్ చేసిన ప్రతి ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేస్తారు. మీరు ఆఫీసులో కొత్త బాధ్యతలను తీసుకుంటారు. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు భారీగా లాభాలను ఇస్తాయి. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. మిమ్మల్ని లక్ కలిసి వస్తుంది. 
మేష రాశి
బుధుడు మీనరాశిలో ఉదయించడం వల్ల మేష రాశి వారు గతంలో చూడనన్ని బెనిఫిట్స్ పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మీరు పేరు ప్రఖ్యాతలు పొందుతారు. వ్యాపారస్తులు లాభపడతారు. ఉద్యోగస్తులకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ రానే వస్తుంది. మీరు బిజినెస్ లో పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది.


Also read: Amalaki Ekadashi Date: అమలకి ఏకాదశి రోజు ఇలా చేస్తే.. మీ ఇంట్లో కాసులు వర్షమే..


వృషభ రాశి 
మెర్క్యూరీ కదలికలు వృషభరాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగుపడుతుంది. మీ కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఆఫీసులో మీ బాస్ మిమ్మల్ని పొగోడుతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగస్తులకు శాలరీ పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. 
(Disclaimer:  ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Grah yuti 2024: కుంభరాశిలో మహా సంయోగం.. ఈ 3 రాశులను వరించనున్న అదృష్టం, ఐశ్వర్యం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి