Shani Shukra Mangal yuti in Kumbh Rashi 2024: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. ఈనెలలో మూడు గ్రహాలు ఒకే రాశిలో కలవబోతున్నాయి. ఇప్పటికే శనిదేవుడు కుంభరాశిలో సంచరిస్తుండగా..రీసెంట్ గా అదే రాశిలోకి శుక్రుడు కూడా ప్రవేశించాడు. త్వరలో కుంభరాశిలోకి కుజుడు కూడా వెళ్లబోతున్నాడు. దీంతో కుంభరాశిలో కుజుడు, శుక్రుడు, శని గ్రహాల కలయిక కారణంగా అరుదైన త్రిగ్రాహి యోగం సంభవించబోతుంది. ఇది మూడు రాశులవారికి అద్భుతంగా ఉండబోతుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
మకరరాశి
మకరరాశి వారికి త్రిగ్రాహి యోగం చాలా లాభాలను ఇస్తుంది. మీ కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీరు హెల్తీగా ఉంటారు. ఎంతోకాలంగా ఎదురుచూసున్న ప్రమోషన్ రానే వస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీ జీవితంలోని సమస్యలన్నీ దూరమవుతాయి. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి.
మేషరాశి
కుంభరాశిలో ఏర్పడబోతున్న త్రిగ్రాహి యోగం మేషరాశి వారి ఆదాయం విపరీతంగా పెరగబోతుంది. మీరు కెరీర్ లో మంచి పొజిషన్ కు వెళతారు. పూర్వీకుల స్థిర చరాస్తులు మీకు కలిసి వస్తాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారస్తులు భారీగా లాభపడతారు. మీకు లక్ కలిసి వస్తుంది. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మీకు లాభాలను ఇస్తాయి.
వృషభం
కుజుడు, శుక్రుడు, శని గ్రహాల సంయోగం కారణంగా వృషభరాశి వారిని అదృష్టం వరించనుంది. మీరు టేకాఫ్ చేసిన ప్రతి ప్రాజెక్టును సక్సెస్ చేస్తారు. ఏదైనా పని లేదా వ్యాపారం ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు కంప్లీట్ అవుతాయి. భార్యభర్తల మధ్య విభేదాలు తొలగిపోతాయి. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Gajakesari Yoga 2024: గురుచంద్రుల కలయికతో గజకేసరియోగం.. ఈ రాశికి లాటరీ తగిలినట్టే..
Also Read: Mercury Transit 2024: బుధుడి సంచారంతో ఈ రాశులవారు మార్చి 15 నుంచి కుబేరులు కాబోతున్నారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి