Budh Uday 2023: రేపు కర్కాటక రాశిలో ఉదయించబోతున్న బుధుడు.. ఈ 3 రాశులకు అదృష్టంతోపాటు ఐశ్వర్యం..
Mercury Rise 2023: ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల రాకుమారుడు అని పిలుస్తారు. రేపు కర్కాటక రాశిలో మెర్క్యూరీ ఉదయించబోతున్నాడు. బుధుడి కదలికలో మార్పు వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
Budh Uday In July 2023: హిందూ పంచాంగం ప్రకారం, రేపు అంటే జూలై 14 శుక్రవారం నాడు బుధుడు కర్కాటక రాశిలో ఉదయించబోతున్నాడు. తెలివితేటలు, వ్యాపారం మరియు స్కిల్స్ కు కారకుడిగా బుధుడిని భావిస్తారు. జాతకంలో బుధుడు బలహీన స్థానంలో ఉంటే మీరు అనేక సమస్యలను ఎదుర్కోంటారు. ఒకవేళ మెర్క్యూరీ శుభ స్థానంలో ఉంటే మీకు దేనికీ లోటు ఉండదు. బుధుడు ఉదయించడం వల్ల ఏయే రాశుల వారికి ప్రయోజనం చేకూరనుందో తెలుసుకుందాం.
మేషరాశి
జూలై 14న బుధుడు కర్కాటక రాశిలో ఉదయించబోతున్నాడు. దీంతో మీరు శుభఫలితాలను పొందనున్నారు. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. మీ కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడతారు. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది.
వృషభం
బుధుడు ఉదయించడం వల్ల వృషభరాశి వారు సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీరు చేసిన ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తులకు మరిన్ని అవకాశాలు లభిస్తాయి. మీ డబ్బు రెట్టింపు అవుతుంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది.
కన్య రాశి
కన్యా రాశి వారికి బుధుడు ఉదయించడం లాభాలను ఇస్తుంది. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. మీరు విదేశాల నుండి ప్రయోజనం పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీ బిజినెస్ విస్తరిస్తుంది. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది.
Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook