Budh Uday 2023: మరో 5 రోజుల తర్వాత ఉదయించబోతున్న బుధుడు... ఈ రాశులవారికి ప్రత్యేక ప్రయోజనాలు..
Budh Uday 2023: గ్రహాల యువరాజు బుధుడు జనవరి 12న ధనుస్సు రాశిలో ఉదయించబోతున్నాడు. ఇది కొన్ని రాశులవారికి ప్రత్యేక ప్రయోజనాలను ఇవ్వనుంది.
Budh Uday 2023 In January: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల రాకుమారుడు బుధుడు జనవరిలో ధనుస్సు రాశిలో ఉదయించబోతున్నాడు. ఒక గ్రహం తన రాశిని మార్చినప్పుడు దాని శుభ మరియు అశుభ ప్రభావం ప్రజలందరిపై ఉంటుంది. జనవరి 12న బుధదేవుడు ధనుస్సు రాశిలో ఉదయించనున్నాడు. ధనుస్సు రాశిపై బృహస్పతి ప్రభావం ఉంటుంది. బుధుడు మరియు గురుడు మిత్రులు. బుధుడు రైజింగ్ కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
సింహరాశి (Leo): బుధుడు ఉదయించడం సింహ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశిచక్రం యొక్క సంచార జాతకంలో ఐదో ఇంట్లో బుధ గ్రహం ఉదయించబోతుంది. దీని కారణఁగా సంతానం లేని దంపతులకు పిల్లలు పుడతారు. ప్రేమ సంబంధాలు బలపడతాయి. మీ లైఫ్ పార్టనర్ నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు ఉద్యోగం సాధించాలనే కోరిక నెరవేరుతుంది. పెళ్లికానీ యువతీ యువకులకు వివాహం కుదిరే అవకాశం ఉంది.
వృశ్చికరాశి (Scorpio): బుధుడు ఉదయించడం వల్ల ఈ రాశి వారికి ధనలాభం కలుగుతుంది. బుధుడు రైజింగ్ ఈరాశి యెుక్క జాతకంలో రెండో ఇంట్లో జరగబోతుంది. ధనలాభం కలిగే అవకాశం ఉంది. వ్యాపారుల భారీ లాభాలను ఆర్జిస్తారు. ఆర్థికంగా పురోగమిస్తారు. మీడియా, సినిమా, విద్య మెుదలైన కెరీర్ కు సంబంధించిన వ్యక్తులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది.
మీనరాశి (Pisces): మీన రాశి వారికి మెర్క్యురీ పెరుగుదల ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయం వృత్తి మరియు వ్యాపార పరంగా లాభదాయకంగా ఉంటుంది. మీరు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఇదే మంచి సమయం. బిజినెస్ లో మీరు పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఈసమయం బాగుంటుంది. వ్యాపారంలో విపరీతమైన లాభం ఉంటుంది.
Also Read: Planet Conjunction 2023: ఒకే రాశిలోకి 3 గ్రహాలు.. 9 రోజుల్లో వీరి అదృష్టం మారిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.