Planet Conjunction 2023: ఒకే రాశిలోకి 3 గ్రహాలు.. 9 రోజుల్లో వీరి అదృష్టం మారిపోవడం పక్కా..

Grah Gochar 2023: ఈ నెలలో మకరరాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. సూర్యుడి గోచారం వల్ల నాలుగు రాశులవారు లాభపడనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 5, 2023, 06:32 PM IST
Planet Conjunction 2023: ఒకే రాశిలోకి 3 గ్రహాలు.. 9 రోజుల్లో వీరి అదృష్టం మారిపోవడం పక్కా..

Surya Gochar In Makar Rashi 2023: జనవరి నెలలో మూడు గ్రహాలు ఒకే రాశిలోకి ప్రవేశించనున్నాయి. జనవరి 14వ తేదీ రాత్రి సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశించనున్నాడు. జనవరి 15న మకర సంక్రాంతి ప్రారంభం అవుతుంది. ఇప్పటికే శనిదేవుడు మకర రాశిలో ఉన్నాడు. శుక్రుడు కూడా మకరంలోకి ప్రవేశించనున్నాడు. మకర రాశిలో మూడు గ్రహాల కలయిక వల్ల అరుదైన త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల అనేక రాశుల వారి అదృష్టం ప్రకాశించనుంది. సూర్యభగవానుడు మకరరాశిలోకి వెళ్లడం వల్ల ఏ రాశులవారికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం. 

మిథునరాశి (Gemini): మకరరాశిలో సూర్య సంచారం మిథునరాశి వారికి మేలు చేస్తుంది. ఆఫీసులో సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి దూరమవుతుంది. ఆర్థిక విషయాల్లో లాభపడతారు. ప్రేమ జీవితం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. పూర్వీకుల ఆస్తి లాభిస్తుంది. 
కర్కాటకం (Cancer): సూర్యుడి రాశి మార్పు కర్కాటక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. లైఫ్ పార్టనర్ సపోర్టు లభిస్తుంది. ఉద్యోగానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. పెళ్లికాని యువతీయువకులకు వివాహం కుదురుతుంది. భాగస్వామ్యంతో చేసే పనుల్లో మంచి లాభం  ఉంటుంది. 

వృశ్చికం (Scorpio): సూర్యభగవానుడు గోచారం వృశ్చికరాశి వారికి చాలా లాభాలను  ఇస్తుంది. మీరు కెరీర్‌లో కొత్త అవకాశాలను పొందుతారు. ఉద్యోగస్తులు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. తోబుట్టువుల మద్దతు లభిస్తుంది. ఇప్పుడు పెట్టే పెట్టుబడి మీకు భవిష్యత్తులో మంచి లాభాలను ఇస్తుంది. 
మకరరాశి (Capricorn): సూర్యుడు మకరరాశి ప్రవేశం మకరరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ ప్రగతిపథానికి దారులు తెరుచుకుంటాయి. ఈ సమయంలో ఎవరినీ గుడ్డిగా నమ్మెుద్దు. లైఫ్ పార్టనర్ సపోర్టు మీకు లభిస్తుంది. ఉద్యోగులకు, వ్యాపారులు మంచి లాభాలను ఆర్జిస్తారు. 

Also Read: Jupiter transit 2023: అస్తమించే దశలో మేషరాశిలోకి బృహస్పతి... ఈ 3 రాశులకు కెరీర్ లో అపారమైన పురోగతి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News