Budh Rashi Parivartan 2022: బుద్ధిని ప్రసాదించే బుధుడు డిసెంబరు నెల మెుదట్లో ధనుస్సు రాశిలో, ఆ తర్వాత మకరరాశిలో సంచరిస్తాడు. దీని ప్రభావం మెుత్తం 12 రాశులవారిపై ఉంటుంది. ఆస్ట్రాలజీ ప్రకారం, బుధుడు డిసెంబరు 3న ధనస్సు రాశిలోకి, డిసెంబరు 28న మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు. బుధుడు డిసెంబరులో తన స్థానాన్ని రెండు సార్లు మార్చనున్నాడు. దీని ప్రభావం ఏ రాశివారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలుసుకుందాం.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్కాటక రాశి (Cancer): ఈ రాశి వారికి బుధుడు మూడవ మరియు పన్నెండవ ఇంటికి అధిపతి. ఈరాశివారు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. కాబట్టి ఈ సమయంలో హెల్త్ పై దృష్టి పెట్టండి. వ్యాపారం, ఉద్యోగాల్లో కూడా ఈసమయం అంతగా కలిసిరాదు. 
మకరరాశి (Capricorn): మకర రాశి వారికి బుధుడు ఆరవ మరియు తొమ్మిదవ ఇంటికి అధిపతి. దీంతో వ్యాపారులు భారీగా నష్టపోతారు. ఖర్చులు పెరగడం వల్ల ఆర్థికంగా నష్టాలను చవిచూస్తారు. మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. 


కుంభ రాశి (Aquarius): ఈ రాశి వారికి బుధుడు ఐదవ మరియు ఎనిమిదవ గృహాలకు అధిపతి. ఈ సమయం విద్యార్థులకు మేలు చేస్తుంది. కొంత మంది అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపారం మరియు వృత్తిలో మీ కృషికి తగ్గ ఫలితాలు లభిస్తాయి.
మీనరాశి (Pisces): మీన రాశి వారికి బుధుడు నాల్గవ, సప్తమ గృహాలకు అధిపతి. ప్రయాణాలు నుండి మీరు ప్రయోజనం పొందుతారు. ఆస్తిలో పెట్టుబడి పెట్టడం వల్ల మీరు బెనిఫిట్స్ పొందుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. 
వృశ్చిక రాశి (Scorpio): ఈ రాశి యెుక్క 8వ మరియు 11వ ఇంటికి బుధుడు అధిపతి. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మతపరమైన ప్రయాణాలు అనుకూలిస్తాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. 


Also Read: Shukra Rise 2022: నవంబరు 20న ఉదయించబోతున్న శుక్రుడు... ఈ రాశులవారికి మంచి రోజులు ప్రారంభం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి