Budhaditya Rajayogam 2023: బుధాదిత్య రాజయోగంతో అక్టోబర్ 1 నుంచి ఈ 5 రాశుల ఖజానాలో లెక్కలేనంత బంగారం
Budhaditya Rajayogam 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఒక్కొక్క గ్రహాన్ని ఓక్కోలా పిలుస్తుంటారు. అందుకే గ్రహాల కదలిక లేదా రాశి మారడం అన్ని రాశుల జాతకాలపై ప్రభావం చూపిస్తుంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Budhaditya Rajayogam 2023: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి చాలా మహత్యముంది. గ్రహాల కదలిక, రాశి పరివర్తనం, రాశులపై పడే ప్రభావం గురించి విపులంగా ఉంది. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. అదే విధంగా అక్టోబర్ నెలలో కీలకమైన గ్రహాల గోచారం ఉంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
గ్రహాల యువరాజుగా పిల్చుకునే బుధుడు అక్టోబర్ 1న కన్యా రాశిలో ప్రవేశించనున్నాడు. అదే సమయంలో ఆ రాశిలో సూర్యుడితో కలయిక కారణంగా బుధాదిత్య యోగం ఏర్పడనుంది. అక్టోబర్ 1వ తేదీ రాత్రి 8 గంటల 45 నిమిషాలకు బుధుడు కన్యా రాశిలో ప్రవేశించనున్నాడు. కన్యా రాశిలో ఆ సమయానికి సూర్యుడు ముందు నుంచే ఉండటం వల్ల బుద, సూర్య గ్రహాలు కలిసి ఈ బుధాదిత్య రాజయోగం ఏర్పర్చనున్నాయి. ఈ యోగం కొన్ని రాశులకు అద్భుతమైన వరం లాంటిదని చెప్పవచ్చు. చాలా రాశుల జీవితాలపై సానుకూల ప్రభావం పడనుంది. వ్యాపారం వృద్ధి చెందడం, ఊహించని ధనలాభం కలగడం వంటివి చూస్తారు.
సింహ రాశి జాతకులపై బుధాదిత్య రాజయోగం ప్రభావం అద్బుతంగా ఉండనుంది. అక్టోబర్ నెలంతా ఈ రాశివారికి ఊహించని అద్భుతమైన లాభం కలగనుంది. ఉద్యోగులకు బదిలీ ఉండవచ్చు. విదేశాల్నించి భారీగా ధనలాభం కలగవచ్చు. పూర్వీకుల సంపద లాభిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతి, ఇంక్రిమెంట్ల కారణంగా ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. మొత్తానికి ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బంది తలెత్తదు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
బుధాదిత్య రాజయోగం ప్రభావంతో వృషభ రాశి జాతకులకు అమితమైన ప్రయోజనం కలగనుంది. ఉద్యోగులకు పదోన్నతి, ఇంక్రిమెంట్లు లభించడమే కాకుండా కొత్త ఉద్యోగావకాశాలు ఉంటాయి. వ్యాపారులకైతే ఊహించని లాభాలు ఉంటాయి. కొత్త పెట్టుబడులు పెట్టేందుకు చాలా అనువైన సమయం. చాలాకాలంగా వ్యాపారంలో నష్టాలు ఎదురౌతుంటే ఈ సమయంలో ఆ నష్టాల్నించి తేరుకోవచ్చు.
మేష రాశి జాతకులకు బుధాదిత్య రాజయోగం ప్రభావంతో అంతా బాగుంటుంది. ఉద్యోగులకు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు ఉంటాయి. కొత్త ఉద్యోగావకాశాలు కూడా ఉండటంతో కెరీర్ అద్భుతంగా ఉంటుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్నించి ఉపశమనం కలుగుతుంది. వ్యాపారులకు అమితమైన లాభాలుంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
బుధాధిత్య రాజయోగం ప్రభావం ధనస్సు రాశి జాతకులకు అద్భుతంగా ఉండనుంది. ఈ సందర్భంగా పెద్దఎత్తున ధనలాభం కలగవచ్చు. ఉద్యోగంలో పదోన్నతితో పాటు ఆకశ్మికంగా పెద్దఎత్తున డబ్బులు అందుతాయి. ఆస్థి పెరగవచ్చు. వ్యాపారులైతే కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశముంది. ముఖ్యంగా ఈ రాశివారికి అదృష్టం తోడుగా ఉంటుంది.
కన్యా రాశి జాతకులకు బుధాదిత్య రాజయోగంతో ఈ సమయం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. అక్టోబర్ నెల వ్యాపారులకు చాలా అనువైన సమయం. ఊహించని లాభాలు ఆర్జిస్తారు. అటు ఉద్యోగులకు కూడా ధనలాభం ఉంటుంది. పదోన్నతులు, కోరుకున్నచోటికి బదిలీ, ఇంక్రిమెంట్లు ఇలా వివిధ రూపాల్లో లాభం కలగనుంది. భాగస్వామ్య వ్యాపారంలో సైతం మంచి లాభాలుంటాయి. ఆర్దికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు.
Also read: September Horoscope 2023: ఈ మూడు రాశుల జాతకులు బీకేర్‌ఫుల్, ఈ నెలలో ధనహాని
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook