Budhaditya Rajayogam 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం  ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. ఆ సమయంలో ఆ రాశిలో మరో గ్రహం ఉంటే రెండు గ్రహాల కలయికతో యోగాలు ఏర్పడుతుంటాయి. అదే విధంగా సూర్య, బుధ గ్రహాల కలయికతో ఏర్పడే బుధాదిత్య రాజయోగం ప్రభావం కొన్ని రాశులపై అమితంగా ఉండనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యం ప్రకారం బుధాదిత్య రాజయోగాన్ని అత్యంత శుభప్రదంగా భావిస్తారు. సూర్య, బుధ గ్రహాలు సింహ రాశిలో ఉండటం వల్ల ఏర్పడే యోగమిది. ఆగస్టు 17వ తేదీన సూర్యుడు సింహ రాశిలో ప్రవేశించినప్పుడు ఆ రాశిలో అప్పటికే ఉన్న బుధుడితో కలిసి బుధాదిత్య రాజయోగం ఏర్పర్చింది. అంటే సింహ రాశిలో బుధ, సూర్య గ్రహాల కలయికతో ఈ రాజయోగం ఏర్పడింది. సూర్యుడు ప్రతి రాశిలో నెలరోజులు కచ్చితంగా ఉండటం వల్ల సెప్టెంబర్ 17 వరకూ ఇదే పరిస్థితి కొనసాగనుంది. ఈ రాజయోగం వివిధ జాతకుల అదృష్టాన్ని మార్చేయనుంది. ఫలితంగా అంతులేని ధన సంపదలు, విజయం లభిస్తాయి. వాస్తవానికి మొత్తం 12 రాశులపై ప్రభావం చూపించినా..3 రాశులకు మాత్రం అత్యంత కీలకం కానుంది. ఈ మూడు రాశులకు ఊహించనివిధంగా ధనలాభం చేకూర్చనుంది. 


కర్కాటక రాశి జాతకులకు బుధాదిత్య రాజయోగం ప్రభావం అత్యంత లాభదాయకంగా ఉండనుంది. ఈ సమయంలో ఈ రాశి జాతకులకు చాలా అనువైందిగా ఉంటుంది. వ్యాపారంలో ఊహించని లాభాలు కలగనున్నాయి. ఆదాయ మార్గాలు పెరగడంతో ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సమస్యలు తీరిపోతాయి. ఊహించిన విధంగా ధనలాభం కలుగుతుంది. 


ఇక తుల రాశి జాతకులకు బుధాదిత్య రాజయోగం చాలా ప్రయోజనంగా ఉంటుంది. అప్పుల్నించి విముక్తి పొందవచ్చు. పాత పెట్టుబడులు లాభాల్ని అందిస్తాయి. మీ ప్రజాదరణ పెరుగుతుంది. జీవిత భాగస్వామితో మంచి బంధం కొనసాగవచ్చు. బుధాదిత్య రాజయోగం సానుకూల ప్రభావం మీ జీవితంపై స్పష్టంగా కన్పించవచ్చు. ఉద్యోగులకు బాగుంటుంది. ఆదాయ మార్గాలు పెరగడం లేదా ఆదాయం పెరగడంతో ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బంది ఎదురుకాదు. వ్యాపారులకు లాభాలు ఉంటాయి.


సింహ రాశిలో ఏర్పడిన బుదాదిత్య రాజయోగం ప్రభావంతో సెప్టెంబర్ 17 వరకూ మేష రాశి జాతకులకు ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయి. కుటుంబంలో ఆనందం, ఉత్సాహభరిత వాతావరణం ఉంటుంది. దాంతోపాటు వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. అటు ఉద్యోగులకు కూడా పదోన్నతి, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ఆర్దికంగా పటిష్టమైన స్థితిలో ఉండవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. 


Also read: Rakshabandhan 2023: రాఖీ నుంచి ఈ మూడు రాశుల జీవితాలు మారిపోవడం ఖాయం, అంతులేని ధన సంపదలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook