Budhaditya Rajayogam: ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు యోగాలు ఏర్పడతాయి. అదే విధంగా సూర్య,బుధ గ్రహాల కలయికతో బుధాదిత్యో యోగం ఏర్పడనుంది. ఈ రెండు గ్రహాలు ధనస్సు రాశిలో కలవనున్నాయి. ఫలితంగా మూడు రాశులకు అదృష్టం తోడుగా నిలుస్తుంది. కనకవర్షం కురుస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రేపట్నించి మూడు రాశులకు జాతకం మారిపోనుందంటున్నారు జ్యోతిష్య పండితులు. కొత్త ఏడాది ప్రారంభంలోనే అంటే జనవరి 7వ తేదీన బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. వారం రోజులుపాటు ఈ రాజయోగం ఉంటుంది. బుధుడు ధనస్సు రాశిలో ప్రవేశించడం అప్పటికే ఆ రాశిలో ఉన్న సూర్యుడితో కలయిక కారణంగా బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. బుధ, సూర్య గ్రహాల యుతితో ఏర్పడనున్న రాజయోగం మొత్తం 12 గ్రహాలపై పడనుంది. మూడు రాశులకు అద్భుతంగా మారనుంది. అంటే రేపట్నించి మూడు రాశుల జాతకం పూర్తిగా మారిపోనుంది. 


వృషభ రాశి జాతకులకు బుధాదిత్య యోగం కారణంగా పాజిటివ్ పరిణామాలు కలగనున్నాయి. ఆకశ్మిక ధనలాభం కలుగుతుంది. ఉద్యోగులకు అన్నీ అనుకూలిస్తాయి. కొత్త ఉద్యోగావకాశాలు, పదోన్నతి ఉంటాయి. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు కలుగుతాయి. అదృష్టం తోడుగా ఉండటంతో అన్ని పనులు నెరవేరతాయి. వ్యాపారులు విశేషమైన లాభాలు ఆర్జిస్తారు. ఆకశ్మిక ధనలాభం కలుగుతుంది. ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంటారు. 


బుధాదిత్య రాజయోగం కారణంగా ధనస్సు రాశి జాతకం రేపట్నించి పూర్తిగా మారిపోనుంది. చేపట్టిన ప్రతి పని విజయవంతమౌతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారంలో ఊహించని లాభాలు కలగడమే కాకుండా వ్యాపారం విస్తృతం చేయవచ్చు. కొత్తగా ఇళ్లు లేదా వాహనం కొనుగోలు చేస్తారు. అనుకోనివిధంగా డబ్బు వచ్చి పడుతుంది. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. ఆనారోగ్య సమస్యలు దూరమౌతాయి. కొత్త ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విద్యార్ధులకు కెరీర్ అద్భుతంగా ఉంటుంది. 


మేష రాశి జాతకులకు సూర్య, బుధ గ్రహాల యుతి కారణంగా బుధాదిత్య రాజయోగం అత్యంత ప్రయోజనం చేకూర్చనుంది. కెరీర్‌లో వృద్ధి ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు అంతా అనుకూలిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలుంటాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఉద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లాభించవచ్చు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీవితంలో వెనుదిరిగి చూసుకోవల్సిన పరిస్థితి ఉండదు. అంతా అనుకూలిస్తుంది


Also read: Ayodhya Ram Mandir: ఆరోజే అయోధ్య రాముని ప్రతిష్ట ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook