Chaitra Navaratri Effect: ప్రతి ఏటా చైత్ర మాసంలో శుక్లపక్షం పాడ్యమి రోజున చైత్ర నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 11 వరకు చైత్ర నవరాత్రులు జరుగుతాయి. నవరాత్రుల్లో 9 దుర్గా రూపాలను పూజిస్తారు. నవరాత్రుల సందర్భంగా అమ్మవారు భువి దర్శనానికి వస్తుందని చెబుతారు. ఆ సమయంలో 2 గ్రహాలు రాశిచక్రాన్ని మారుతాయి. ఇలా జరగడం వల్ల రాశిచక్రంలోని ఆరు రాశుల వారికి కలిసొస్తుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నవరాత్రులలో వీరికి అమ్మవారికి అనుగ్రహం సిద్ధిస్తుంది :


మేషం - మేష రాశి వారికి చైత్ర నవరాత్రులు చాలా శుభప్రదమైనవి. దుర్గామాత అనుగ్రహంతో ఈ రాశి వారు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపార రంగంలో మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రశంసలు దక్కుతాయి. ప్రమోషన్ పొందే అవకాశం ఉంటుంది.


వృషభం - వృషభ రాశి వారు చేపట్టే ప్రతీ పనిలో విజయం సాధిస్తారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. డబ్బుకు కొదువ ఉండదు. ఆర్థికంగా మరింత బలోపేతమవుతారు. మీరు చేస్తున్న పనిలో మీ బాస్ అభినందనలు పొందుతారు. ఒక పెద్ద బాధ్యతను నిర్వహించే అవకాశం మీకు దక్కవచ్చు.


కర్కాటకం - కర్కాటక రాశి వారికి ధన లాభం కలుగుతుంది. నగదు రూపంలో సంపద చేకూరుతుంది. ముఖ్యంగా వ్యాపారులు లాభపడతారు. వ్యాపారం వేగంగా పురోగమిస్తుంది. కొత్త పరిచయాలు కలిసొస్తాయి. మానసికంగా, శారీరకంగా ప్రశాంత జీవనం గడుపుతారు.


సింహం - సింహ రాశి వారు ఈ కాలంలో కొన్ని శుభవార్తలను అందుకుంటారు. గతంలో పెండింగ్‌లో ఉన్న పనులన్నీ ఇప్పుడు పూర్తి చేస్తారు. అనుకోని మార్గాల్లో ఆదాయం చేకూరుతుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు వాటి నుంచి బయటపడుతారు. 


కన్య - కన్య రాశి వారికి దుర్గా మాత అనుగ్రహంతో సంపద కలుగుతుంది. ప్రేమ విషయాలలో కన్యా రాశి వారికి ఇది అనుకూల సమయం. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి కలిసొస్తుంది. 


తులారాశి - ఈ నవరాత్రులు తులారాశి వారికి చాలా శుభప్రదం. ధన ప్రవాహంతో ఇంట్లో డబ్బుకు కొదువ ఉండదు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం సాఫీగా సాగుతుంది.


(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ అంచనాలు మరియు ఊహలపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీనికి బాధ్యత వహించదు.)


Also Read: Russia Ukraine War: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హత్య కుట్ర భగ్నం...


Also Read: PBKS vs RCB Records: అరుదైన రికార్డు నెలకొల్పిన పంజాబ్‌.. బెంగళూరు ఖాతాలో చెత్త రికార్డు!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook