Chanakya niti: ఈ 3 చెడు అలవాట్లను వీలైనంత త్వరగా వదిలేస్తే...విజయలక్ష్మీ మీ వెంటే..!
Chanakya niti: మనం ఎలా జీవించాలో అనే విషయాలను ఆచార్య చాణిక్యుడు ఎప్పుడో చెప్పాడు. కొందరు ఈ మూడు విషయాలకు దూరంగా ఉంటే వారిని విజయం ఎల్లప్పుడూ వరిస్తుందని ఆయన అన్నారు.
Chanakya niti for happy life: ఆచార్య చాణిక్యుడు గురించి మనందరికీ తెలిసిందే. ఈయన మనం ఎలా జీవించాలో అనే విషయాలను తన చాణిక్య నీతిలో (Chanakya niti) చెప్పారు. ఈయన ప్రకారం, ప్రతి వ్యక్తి కష్టపడితేనే విజయం వస్తుంది. దీనిని మనం ఎంత తొందరగా అర్థం చేసుకుంటే అంత త్వరగా జీవితంలో స్థిరపడతాం. అయితే మీ గెలుపుకు కొన్ని చెడు ఆలవాట్లు అడ్డంకి కావచ్చు. వీటిని వీలైనంత త్వరగా వదలించుకోవడం మంచిది. లేకపోతే మీరు జీవితంలో ముందుకు వెళ్లలేరు. అంతేకాకుండా సమాజంలో మీకు గౌరవం తగ్గుతుంది. మీ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాలనుకుంటే ఈ మూడు చెడు ఆలవాట్లును వదిలేయండి.
ఈ 3 అలవాట్లును మానుకోండి
వెన్నుపోటు పొడవడం: మనలో కొంత మంది ఎల్లప్పుడూ ఇతరులకు చెడు చేయాలనే చూస్తారు. వారిని సరైన సమయం చూసి వెన్నుపోటు పొడుస్తారు. ఇది మంచి పద్దతి కాదు. ఈ అలవాటుకు దూరంగా ఉండండి.
అబద్ధం చెప్పడం: మీరు జీవితంలో గౌరవాన్ని పొందాలనుకుంటే, ఎల్లప్పుడూ నిజం చెప్పడానికి ప్రయత్నించండి. అప్పుడే మీ మీద నమ్మకం పెరుగుతుంది. కొంత మంది వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాలు కోసం అబద్ధాలు చెబుతారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదు. ఇకనైనా నిజం పలకడం నేర్చుకోండి.
గొప్పలు చెప్పుకోవడం: కొందరికి ఎక్కడ చూసినా తమ గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. తమను ఎల్లప్పుడూ తెలివైనవారిగా, మేధావులుగా భావించాలని వారు చూస్తూ ఉంటారు. ఇలాంటి వాటికి దూరంగా ఉండండి.
Also Read: గణేష్ చతుర్థి ఎప్పుడు? పూజా విధానం, శుభ ముహూర్తం గురించి తెలుసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook