Ganesh chaturthi 2022: గణేష్ చతుర్థి ఎప్పుడు? పూజా విధానం, శుభ ముహూర్తం తెలుసుకోండి..

Ganesh chaturthi 2022: ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి నాడు వినాయక చవితిని జరుపుకుంటారు. ఈ పండుగ 10 రోజుల పాటు జరుపుకుంటారు.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 21, 2022, 01:24 PM IST
Ganesh chaturthi 2022: గణేష్ చతుర్థి ఎప్పుడు? పూజా విధానం, శుభ ముహూర్తం తెలుసుకోండి..

Ganesh chaturthi 2022 Date, Shubh Muhurtam:  హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి నాడు పవిత్రమైన గణేష్ చతుర్థి లేదా వినాయక చవితి (Ganesh chaturthi 2022) పండుగను జరుపుకుంటారు. ఈ రోజు నుండే గణేష్ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ పండుగను 10 రోజుల పాటు జరుపుుకుంటారు. ఈ పండుగ రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేస్తారు. అనంత చతుర్దశి రోజున గణపతిని నిమజ్జనం చేశారు. ఈరోజున ఆ దేవుడిని పూజించడం వల్ల భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి. 

శుభ సమయం
చతుర్థి తిథి ప్రారంభం : 30 ఆగస్టు 2022 మధ్యాహ్నం 03:33 గంటలకు
చతుర్థి తేదీ ముగింపు: 31 ఆగస్టు 2022 మధ్యాహ్నం 03:22 గంటలకు
గణేష్ చతుర్థి ఉపవాసం తేదీ: ఆగస్టు 31, 2022

పూజా విధానం
గణేష్ చతుర్థి రోజున ఉదయాన్నే స్నానం చేసిన ఇంట్లోని పూజ మందిరంలో దీపం వెలిగించండి. అనంతరం సరైన సమయంలో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించండి. తర్వాత గణపతికి గంగాజలంతో అభిషేకం చేయండి. ఆ దేవుడికి పువ్వులు, దుర్వ గడ్డిని సమర్పించండి. నుదటిని కుంకుమ దిద్దండి. నైవేద్యంగా లడ్డూలను పెట్టండి. అనంతరం గణేశుడి వ్రత కథ చదవి హారతి ఇవ్వండి. చివరగా అందరికీ ప్రసాదం పంచిపెట్టండి. 

పూజ సామగ్రి జాబితా
గణేశుడి విగ్రహం, ఎరుపు వస్త్రం, దారం, దూర్వా, కలశ, కొబ్బరి, రోలి, పంచామృతం, లడ్డూ, పంచమేవ, గంగాజలం.

Also Read: Aja Ekadashi 2022: అజ ఏకాదశి ఎప్పుడు? పూజ చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తించుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News