Chandra Grahan 2024 Remedy: హిందువులు గ్రహణాలను అశుభకరంగా భావిస్తారు. ఈ సంవత్సరం రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు సంభవించబోతున్నాయి. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మార్చి 25న ఫాల్గుణ పూర్ణిమ రోజు సంభవించబోతుంది. ఇది జరిగిన 15 రోజుల తర్వాత చైత్ర అమావాస్య నాడు సంవత్సరంలో తొలి సూర్యగ్రహణం ఏర్పడనుంది. చంద్రగ్రహణానికి 9 గంటల ముందు సూతక్ కాలం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో గ్రహణం వల్ల కలిగే అశుభాలు తొలగిపోవడానికి జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని పరిహారాలు చెప్పబడ్డాయి. అలాంటి వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చంద్రగ్రహణానికి 9 గంటల ముందు సూతకం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో గ్రహణం వల్ల కలిగే అశుభాలు దూరం కావాలంటే జ్యోతిష్య శాస్త్రంలో అనేక నియమాలను పాటించే సంప్రదాయం ఉంది. అన్ని ఇళ్ళలో తరచుగా చేసే ఈ పనులలో ఒకటి తులసి ఆకులను ఆహారం మరియు పానీయాల ముందు ఉపయోగించడం, తద్వారా గ్రహణం యొక్క అశుభాలు ఈ వస్తువులపై పడవు. అయితే గ్రహణం వల్ల కలిగే అశుభ ప్రభావాలను నివారించడానికి తులసితో పాటు ఒక ఆకు కూడా ఉందని మీకు తెలుసా. దీని గురించి తెలుసుకుందాం.


గ్రహణం యెుక్క అశుభ ప్రభావాలు తగ్గాలంటే..
దుర్వా గడ్డి 
జ్యోతిష్యంలో దూర్వా గడ్డి చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. దీనిని ఎక్కువగా పూజలు మరియు శుభకార్యాలలో ఉపయోగిస్తారు. ఈ గడ్డి గురించి పురాణాల్లో కూడా చెప్పబడింది. గ్రహణ సమయంలో దుర్వాను ఉపయోగించడం వల్ల మీరు అశుభ ప్రభావాల నుంచి బయటపడతారు. 
 నువ్వులు 
గ్రహణ సమయంలో ప్రతికూల శక్తులు మేల్కోంటాయి. వాటి దుష్ఫలితాలను నివారించడానికి ఆ టైంలో దానధర్మాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఈ సమయంలో నువ్వులను దానం చేయడం వల్ల రాహు, కేతువు బాధల నుండి విముక్తి పొందుతారు. 
గంగాజలం 
హిందూ మతంలో గంగాజలం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. గ్రహణ సమయంలో గంగాజలంతో స్నానం చేయడం వల్ల దుష్ప్రభావాలు తొలగిపోతాయి. 


Also Read: Magh Purnima 2024: మాఘ పూర్ణిమ నాడు అద్భుత యోగం.. ఈ 3 రాశులవారి కష్టాలు దూరం..


Also Read: Trigrahi Yog 2024: ఈ రాశులవారిపై త్రిగ్రాహి యోగం ఎఫెక్ట్‌..మార్చి నెలలో జరగబోయే 100 శాతం ఇదే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter