Chandragrahanam 2022: వివిధ మతాచారాల్లో సూర్య, చంద్ర గ్రహణాలకు కొన్ని నమ్మకాలుంటాయి. గ్రహాలు, రాశుల స్థానం కారణంగా సూర్య, చంద్ర గ్రహణాల్ని అరిష్టంగా లేదా శుభంగా భావిస్తారు. ఆ వివరాలు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మే 16వ తేదీ అంటే రేపు ఏర్పడనుంది. ఈసారి చంద్రగ్రహణం వృశ్చికరాశిలో ఉంటుందనేది జ్యోతిష్యశాస్త్రం చెబుతున్న మాట. ఇండియాలో కన్పించదు కాబట్టి సూతక్ కాలం చెల్లదని పండితులంటున్నారు. ఈసారి చంద్ర గ్రహణం చాలామంది జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతుందనేది ఓ నమ్మకం. ఎందుకంటే కొన్ని రాశి చక్ర గుర్తులకు ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం సమస్యలు సృష్టించవచ్చు. మరికొన్ని రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎవరికి సానుకూలమో చూద్దాం.


మేషరాశివారిపై ఈసారి ఏర్పడే తొలి చంద్ర గ్రహణం విశేష ప్రభావం చూపిస్తుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ప్రగతి కన్పిస్తుంది. ప్రజలతో మంచి సంబంధాలు ఉంటాయి. ఇక సింహరాశివారికి కూడా చంద్ర గ్రహణం ప్రభావంతో అంతా శుభమే జరుగుతుంది. ఈ రాశివారి అన్ని పనులపై సానుకూల ప్రభావం ఉంటుందని పండితులు అంటున్నారు. ఉద్యోగంలో పురోగతి కన్పిస్తుంది. పనిపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. 


ఇక ధనస్సు రాశివారిపై కూడా మే 16 అంటే రేపు ఏర్పడనున్న తొలి చంద్ర గ్రహణం అనుకూలంగా ఉంటుంది. ఆర్ధిక విషయాలు మెరుగవుతాయి. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. అనుకున్న పని సాధిస్తారు. ముఖ్యంగా ఆర్ధికంగా బలమైన స్థితికి చేరుకుంటారని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. 


Also read: Chandra Grahan 2022: చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా? సూతక్ కాలం ఉంటుందా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.