ఇవాళ నవంబర్ 23వ తేదీన మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, మీ లక్కీ టైమ్ ఎప్పుడు
గ్రహాలు కదలికలు..రాశులను బట్టి మీ జాతకం ఎలా ఉందో చెప్పేదే జ్యోతిష శాస్త్రం. చాలామందికి జ్యోతిష శాస్త్రంపై నమ్మకముంటుంది. ప్రతిరోజూ తమ జాతకం ఎలా ఉంటుందో అనే ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలో ఇవాళ అంటే నవంబర్ 23వ తేదీన మీ మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
గ్రహాలు కదలికలు..రాశులను బట్టి మీ జాతకం ఎలా ఉందో చెప్పేదే జ్యోతిష శాస్త్రం. చాలామందికి జ్యోతిష శాస్త్రంపై నమ్మకముంటుంది. ప్రతిరోజూ తమ జాతకం ఎలా ఉంటుందో అనే ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలో ఇవాళ అంటే నవంబర్ 23వ తేదీన మీ మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషరాశి: ఈ రాశివారికి ఆరోగ్య పరిస్థితులు మిశ్రమంగా ఉంటాయి. ఆర్ధికంగా ఇవాళ మంచిరోజు. వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులు మిశ్రమ లాభాల్ని ఆర్జిస్తారు. కుటుంబ జీవితంలో పరిస్థితులు అనువుగానే ఉంటాయి. అనవసరమైన ఘర్షణలకు దూరంగా ఉంటే మంచిది. ఈ రాశివారి లక్కీ టైమ్ ఉదయం 6 గంటల్నించి మద్యాహ్నం 12 గంటల వరకూ ఉంటుంది.
వృషభరాశి : ఈ రాశివారికి ఆర్ధికంగా బాగుంటుంది. ఆరోగ్యపరంగా మాత్రం ప్రతికూల పరిస్థితులు ఎదురుకానున్నాయి. వైవాహిక జీవితం బాగుంటుంది. ఇరువురి మధ్య సంబంధాలు బలపడతాయి. వ్యాపారులకు అనువైన రోజు. విద్యార్ధులైతే కష్టపడి చదివితే మంచిది. ఈ రాశివారి లక్కీ టైమ్ సాయంత్రం 5 గంటల 55 నిమిషాల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఉంటుంది.
మిధున రాశి : ఈ రాశిలో పుట్టినవారికి ఆరోగ్యపరంగా ప్రతికూలంగా ఉండవచ్చు. ఇక ఆర్ధికంగా ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. కుటుంబసభ్యుల మధ్య సమన్వయం దెబ్బతినే అవకాశాలున్నాయి. జీవిత భాగస్వామి మానసిక పరిస్థితి దెబ్బతింటుంది. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. మంచిది కాదంటున్నారు పండితులు. ఈ రాశివారి లక్కీటైమ్ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ఉంది.
కర్కాటక రాశి : ఈ రాశివారికి కూడా ఆరోగ్యం విషయంలో ప్రతికూల పరిస్థితులుంటాయి. ముఖ్యంగా కాళ్ల నొప్పి సమస్య ఎక్కువగా ఉండవచ్చు. ఇక ఆర్ధికంగా బాగుంటుంది. వ్యాపారులకైతే పెద్ద డీల్స్ సెట్ అవుతాయి. జీవిత భాగస్వామితో మరింత ప్రేమగా ఉంటారు. పెళ్లికానివారైతే..ఏ విధమైన తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు. ఈ రాశివారి లక్కీటైమ్ మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఉంది.
సింహ రాశి : ఈ రాశిలో పుట్టినవారు ఆరోగ్యం బాగుంటుంది కానీ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఒత్తిడికి దూరంగా ఉండాల్సి ఉంుటంది. ఆర్ధికంగా పరిస్థితులు బాగుంటాయి. ఉద్యోగస్థులకు మంచి గుర్తింపు లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో తొందరపాటు మంచిది కాదు. నిర్ణయాలు తెలివిగా..సొంతంగా తీసుకుంటేనే మంచిది. ఈ రాశివారికి లక్కీటైమ్ సాయంత్రం 4 గంటల్నించి రాత్రి 9 గంటల వరకూ ఉంటుంది.
కన్య రాశి : ఈ రాశిలో పుట్టినవారికి ఆర్ధికంగా చాలా బాగుంటుంది కానీ ఆరోగ్యపరంగా కాస్త ఇబ్బంది ఎదురుకావచ్చు. ముందూ వెనుకా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే ఫలితాలు అనుభవిస్తారు. వ్యాపారస్థులకు ప్రతికూలంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉంటే మంచిది. ఈ రాశివారి లక్కీటైమ్ ఉదయం 8 గంటల్నించి సాయంత్రం 5 గంటల వరకూ ఉంది.
తుల రాశి : ఈ రాశిలో పుట్టినవారి ఆరోగ్య పరిస్థితి బాగుండదు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ఇక ఆర్ధికపరంగా ఫరవాలేదు. ఉద్యోగం మారాలనే ఆలోచన ఉంటే తెలివిగా నిర్ణయం తీసుకోండి. జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడిపితే ఏ విధమైన సమస్యలు ఉండవు. కుటుంబసభ్యులతో సంబంధాలు దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. ఈ రాశివారి లక్కీ టైమ్ ఉదయం 4 గంటల 35 నిమిషాల నుంచి మద్యాహ్నం 1 గంట వరకూ ఉంది.
వృశ్చిక రాశి : ఈ రాశివారికి ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఆర్ధిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు తప్పవు. కుటుంబ సభ్యులతో గడిపే అవకాశముండదు. జీవిత భాగస్వామి ప్రవర్తనతో మీకు ఇబ్బంది కలగవచ్చు. ఈ రాశివారి లక్కీటైమ్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఉంటుంది.
ధనస్సు రాశి : ఈ రాశిలో పుట్టినవారి ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది. ఇటు కుటుంబ సభ్యులతో కూడా హాయిగా ఉంటుంది. తల్లిదండ్రులు మీపట్ల సంతోషంగా ఉండవచ్చు. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగు పడతాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. ఇక ఈ రాశివారి లక్కీటైమ్ సాయంత్రం 6 గంటల 15 నిమిషాల నుంచి రాత్రి 9 గంటల వరకూ ఉంది.
మకర రాశి : ఈ రాశివారికి ఆరోగ్యపరంగా బాగుంటుంది. అటు ఆర్ధికంగా కూడా మంచి ఫలితాలుంటాయి. వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా కచ్చితంగా మంచి మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్థులు బిజీగా ఉంటారు. చేసే పనులపై దృష్టి పెట్టండి. ఈ రాశివారి లక్కీటైమ్ ఉదయం 6 గంటల 55 నిమిషాల నుంచి సాయంత్ర 4 గంటల వరకూ ఉంటుంది.
కుంభ రాశి : ఈ రాశివారు ఆరోగ్యపరంగా చాలా బాగుంటారు. ఆర్ధికంగా మంచి ప్రయోజనాలుంటాయి. ముఖ్యంగా కొత్త వ్యాపారంలో బాగుంటుంది. అటు ఉద్యోగులకు కూడా బాగుంటుంది. ఇటు జీవితంలో ప్రశాంతత ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగుంటుంది. ఈ రాశివారి లక్కీటైమ్ ఉదయం 4 గంటల 5 నిమిషాల నుంచి మద్యాహ్నం 3 గంటల వరకూ ఉంటుంది.
మీన రాశి : ఈ రాశిలో పుట్టినవారికి ఆరోగ్యం విషయంలో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. ఆర్ధిక పరిస్థితులు సాధారణంగానే ఉంటాయి. వ్యాపారులు, ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో సంబంధాల విషయంలో దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యమైన పనుల విషయంలో బద్దకం మంచిది కాదు. ఈ రాశివారి లక్కీటైమ్ మద్యాహ్నం 2 గంటల్నించి రాత్రి 7 గంటల వరకూ ఉంటుంది.
Also read: కార్తీక సోమవారం నవంబర్ 22న మీ రాశి ఫలాలు ఇలా, ఇదే మీ లక్కీ టైమ్ కూడా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook