Vivaha Prapti: దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన చిలుకూరు బాలాజీ ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా గరుడ ప్రసాదం కార్యక్రమం నిర్వహించగా కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. అంచనాలకు మించి భక్తులు రావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల్లో కీలక మార్పులు జరిగాయి. ఉత్సవాల్లో ముఖ్య ఘట్టం 'వివాహ ప్రాప్తి' కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఈ విషయాన్ని ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌ తెలిపారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Sri Rama Navami 2024: ఒంటిమిట్ట‌ రాములోరి కల్యాణం చూతము రారండి .. బ్రహ్మోత్సవాల షెడ్యూల్‌ ఇదే..


'గరుడ ప్రసాదం తీసుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉత్సవాల్లో ముఖ్యమైన కల్యాణోత్సవం ఆదివారం జరుగనుంది. అయితే అదే రోజు జరిగే 'వివాహ ప్రాప్తి'కి భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. దీని దృష్ట్యా వివాహ ప్రాప్తి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నాం. వివాహం కోసం ఎదురుచూస్తనున్న వారు ఇళ్లలోనే దేవుడిని ప్రార్థించుకోవాలి. ఆలయానికి రావొద్దు' అని రంగరాజన్‌ వీడియో సందేశం ద్వారా సూచించారు.

Also Read: Sri Rama Navami 2024: రామయ్య కల్యాణానికి 'కోడ్‌' అడ్డంకి.. ప్రత్యక్ష ప్రసారానికి నిరాకరణ


వివాహం కోసం ఎదురుచూస్తున్న భక్తుల కోసం చిలుకూరు బ్రహ్మోత్సవాల్లో 'వివాహ ప్రాప్తి' కార్యక్రమ నిర్వహించాలని మొదట నిర్ణయించారు. గరుడ ప్రసాదం సందర్భంగా ఎదురైన పరిణామాలతో ఆలయ నిర్వాహకులు వెనక్కి తగ్గారు. బ్రహ్మోత్సవాల్లో కీలకమైన కల్యాణోత్సవం జరగనుంది. దీనికితోడు ఆదివారం సెలవు దినం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆలయ నిర్వాహకులు వివాహ ప్రాప్తి కార్యక్రమాన్ని రద్దు చేశారు.


వివాహ ప్రాప్తి అంటే?
చిలుకూరు బాలాజీ ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. ఉత్సవాల్లో కీలకమైన కల్యాణోత్సవం ఆదివారం సాయంత్రం నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈసందర్భంగా వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రత్యేకంగా పూజ ప్రసాదం, పూజా కార్యక్రమాలు చేయాలని తొలుత చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం పరిణామాలు మారిపోవడంతో వివాహ ప్రాప్తి కార్యక్రమాన్ని రద్దు చేశారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter