Astrology: 12 ఏళ్ల తర్వాత `గజలక్ష్మి యోగం`.. ఈ 3 రాశులవారికి వరం..
Grah Gochar 2024: త్వరలో బృహస్పతి మరియు శుక్రుడు కలయిక వల్ల అరుదైన గజలక్ష్మి రాజయోగం సంభవించబోతుంది. దీంతో మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు.
Guru shukra yuti 2024: ఒకే రాశిలో రెండు గ్రహాల కలయికను సంయోగం లేదా యుతి అంటారు. ఈ సంవత్సరం మే 01న బృహస్పతి వృషభరాశిలో సంచరించబోతున్నాడు. అదే సమయంలో ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు కూడా వృషభరాశిలోకి వెళ్లబోతున్నాడు. ఒకే రాశిలో గురుడు, శుక్రుడు కలయిక వల్ల అరుదైన గజలక్ష్మి రాజయోగం రూపొందుతుంది. ఇది 12 ఏళ్ల తర్వాత ఏర్పడుతోంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశులవారికి అదృష్టం పట్టనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
మేషరాశి
మేషరాశి వారికి గజలక్ష్మి రాజయోగం అద్భుతంగా ఉండబోతుంది. మీ కోరికలు నెరవేరుతాయి. మీరు ఈ సమయంలో ఏ నిర్ణయాలు తీసుకున్న అవి కరెక్ట్ గా ఉంటాయి. మీకు ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు అవుతాయి. మీకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. పెళ్లికాని వివాహం ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితం సంతోషం తాండవిస్తోంది.
కర్కాటక రాశి
బృహస్పతి మరియు శుక్రుడు కలయిక కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయం వృద్ధి చెందడంతోపాటు మీ బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా పెరుగుతుంది. మీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో సక్సెస్ అవుతారు. ఇప్పడు పెట్టే పెట్టుబడులు మీకు ఊహించన లాభాలను ఇస్తారు. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే సూపర్ గా ఉంటుంది. మీ పని లేదా వ్యాపార నిమిత్తం ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది.
సింహరాశి
గజలక్ష్మి రాజయోగం సింహరాశి వారికి మేలు చేస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు భారీగా డబ్బును ఆదా చేస్తారు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ భారీగా పెరుగుతుంది. మీరు ఈ సమయంలో విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ గౌరవం పెరుగుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు ఈ టైంలో పెట్టే పెట్టుబడులు మీకు లాభాలను ఇస్తాయి.
Also Read: Monday Remedies: సోమవారం.. ఈ ఐదు పరిహారాలు పాటిస్తే జీవితంలోని అన్నిసమస్యలకు పరిష్కారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook