Mercury and Rahu Conjunction in Pisces 2024: ప్రతి నెలా ఏవో కొన్ని గ్రహాలు తమ రాశులను మారుస్తాయి. మార్చి నెలలో కూడా కీలక గ్రహ సంచారాలు జరగబోతున్నాయి. మార్చి 07న బుధుడు మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అప్పటికే అదే రాశిలో రాహువు సంచరిస్తాడు. దాదాపు 18 సంవత్సరాల తర్వాత మీనరాశిలో బుధుడు మరియు రాహువు కలయిక జరగబోతుంది. ఈ రెండు గ్రహాల సంయోగం కొన్ని రాశులవారికి మేలు చేయబోతుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
వృశ్చికరాశి
రాహువు మరియు బుధుడు కలయిక వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. కొత్త పెళ్లైన వారికి సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. మీ లవ్ సక్సెస్ అవుతుంది. మీ సంపద రెట్టింపు అవుతుంది.
మీనరాశి
గ్రహాల సంయోగం వల్ల మీనరాశికి చెందిన వ్యక్తుల యెుక్క గౌరవం పెరుగుతుంది. మీ కెరీర్లో ఎదుగుదల ఉంటుంది. మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. వ్యాపారులకు ఈ సమయం బాగుంటుంది.
వృషభం
బుధుడు మరియు రాహువు కలయిక కారణంగా మీరు కెరీర్లో ఊహించని స్థాయికి వెళతారు. ఈ సమయంలో పెట్టే పెట్టుబడుల మీ ఇంటిపై కనకవర్షం కురిపిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. మీరు ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి మెర్క్యూరీ-రాహు సంయోగం మంచి ఫలితాలను ఇస్తుంది. మీ సంపద రెట్టింపు అవుతుంది. విదేశాల్లో చదువుకోవాలన్న మీ కోరిక నెరవేరుతోంది. అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు పూర్తవుతాయి. ఈ సమయంలో ఉద్యోగ లేదా వ్యాపార నిమిత్తం ప్రయాణాలు చేసే అవకాశం ఉంది, ఇవి మీకు లాభిస్తాయి.
సింహరాశి
గ్రహాల మైత్రి వల్ల సింహరాశి వారి అప్పులన్నీ తీరిపోతాయి. మళ్లీ మీరు ఆర్థికంగా బలపడతారు. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. మీ పనిలో పురోగతి ఉంటుంది. మెుత్తానికి ఈ సమయం మీకు అన్ని విధాల కలిసి వస్తుంది.
(నిరాకరణ: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Shani Transit 2024: శని అనుగ్రహం.. ఈ రాశుల వారికి వచ్చే 10 నెలలు వరం..!
Also Read: Magha Purnima 2024: మాఘ పౌర్ణమి 2024 ప్రత్యేకత, విశిష్టత, చేయాల్సిన పనులు, చేయకూడని పనులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook