Saturn Transit Effect : శని దేవుడి ప్రభావం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. శని ప్రభావానికి ఎంతటి వారైనా సరే తలొగ్గాల్సిందే. శని దేవుడు ప్రస్తుతం తన మార్గాన్ని మార్చుకోబోతోన్నాడు. దీపావళి కంటే ముందు శని దేవుడి మార్గం వల్ల కొన్ని రాశుల వారికి ప్రమాదాలు జరగున్నాయి. వారికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడబోతోన్నాయి. శని మార్గం వల్ల ఏ ఏ రాశుల వారికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడబోతోన్నాయో చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శని సంచారం..
అక్టోబర్ 23న అంటే దీపావళికి ముందు మకరరాశిలోకి  శని ప్రవేశిస్తాడు. శని సంచారం వల్ల జీవితాల్లో అనేక మార్పులు రానున్నాయి. ప్రస్తుతం మకరరాశిలో శని సంచరిస్తున్నాడు. మకరం, కుంభ రాశులకు శని అధిపతి. మామూలుగా అయితే శనికి ఒక రాశి నుండి మరొక రాశికి వెళ్ళడానికి రెండున్నర ఏళ్లు పడుతుంది. ప్రస్తుతం శని పయనించే మార్గం ద్వారా ఏ రాశి వారికి ప్రభావం కలుగుతుందో చూద్దాం.


వృషభరాశిపై శని దుష్ప్రభావం..
శని సంచారం వల్ల వృషభరాశి వారికి జీవితంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. వీరి లక్ కలిసి రాకపోవచ్చు. చేసే పనిలో అడ్డంకులను ఎదుర్కోవచ్చు. ఖర్చులు అధికం, లాభం అల్పం అన్నట్టుగా ఉంటుంది. గృహ, ఆర్థిక సమస్యలు అధికంగా ఉంటాయి.


కర్కాటక రాశి వారికీ తిప్పలే..
శని సంచారం వల్ల కర్కాటక రాశి వారికీ సమస్యలు తప్పవు. వ్యాపారంలో సమస్యలు ఎదురవుతాయి. ఆదాయం తక్కువగా, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అలాగే వైవాహిక జీవితంలో కొన్ని ఎత్తుపల్లాలు ఉంటాయి. ఆర్థిక నష్టాలుంటాయి. ఇది సంబంధాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపించదు. 


కన్యారాశి వారికి కష్టాలే..
శని సంచారం వల్ల కన్యారాశి వారికి.. అన్ని పనుల్లో అడ్డంకులే ఏర్పడతాయి. సన్నిహితులతో వివాదాలు, ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.  ఖర్చులను నియంత్రించుకుంటే మంచిది.


మకరరాశిపై శని ప్రభావం..
శని మార్గం వల్ల మకరరాశి వారి మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. వ్యాపారంలో సమస్యలు వస్తూనే ఉంటాయి. ఖర్చులు అధికం అవుతాయి. గందరగోళం పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త అవసరం ఉంటుంది.


కుంభరాశిపై శని దుష్ప్రభావం
కుంభ రాశి వారు శని మార్గం ద్వారా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తారు. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త వహించండి. విదేశీ ప్రయాణాల యోగం ఉంటుంది. పర్యటనలో చాలా ఖర్చు అవుతుంది.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
 


Also Read : అర్ధరాత్రి మహిళ తెగువ.. ఒడిలో చంటి బిడ్డ.. భుజాన జనసేన జెండా.. చలించిన పవన్ కళ్యాణ్


Also Read : Comedian Harsha Chemudu : కాశ్మీర్ లోయలో సందడి.. భార్యతో కమెడియన్ హర్ష ట్రిప్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook