Devshayani Ekadashi 2022: దేవశయని ఏకాదశి వ్రత కథ వినడం ద్వారా మీ పాపాల నుండి విముక్తి పొందుతారు!
Devshayani Ekadashi 2022: ఈ ఏడాది దేవశయని ఏకాదశి జూలై 10న వచ్చింది. ఈ రోజు నుంచే శ్రీహరి యోగ నిద్రలోకి జారుకుంటారు. ఈ కాలంలో అన్ని శుభకార్యాలు నిలిచిపోతాయి.
Devshayani Ekadashi 2022: ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశినే దేవశయని ఏకాదశి అంటారు. ఈసారి ఈ ఏకాదశిని జూలై 10న జరుపుకోనున్నారు. ఈ రోజు నుంచే శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడని చెబుతారు. అంతేకాకుండా ఇదే రోజు నుంచి చాతుర్మాసం కూడా ఏర్పడుతుంది. దేవశయని ఏకాదశి వ్రత కథను వినడం ద్వారా సర్వపాపాల నుండి విముక్తి పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ వ్రత కథ ఏంటో తెలుసుకుందాం.
ఆషాఢమాసంలోని శుక్ల పక్ష ఏకాదశి ప్రాముఖ్యత గురించి ధర్మరాజు...శ్రీకృష్ణుడికి చెప్పాడు. అప్పుడు శ్రీ కృష్ణుడు ఈ ఏకాదశిని దేవశయనీ ఏకాదశి పిలిచాడు. ఒకసారి నారద మహార్షి బ్రహ్మదేవుడిని ఈ వ్రత ప్రాముఖ్యత గురించి అడిగారు. అప్పుడు ఈ వ్రత మహాత్యం గురించి చెప్పారు బ్రహ్మ. ఈ ఏకాదశిని పద్మ ఏకాదశి అని పిలిచారు సృష్టికర్త.
సూర్యవంశంలో గొప్ప రాజు మాంధాత. ఈయన రాజ్యంలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉండేవారు. ఇతడు ప్రజల క్షేమం కోసం నిరంతరం తపన పడుతూ ఉండేవాడు. అందుకోసం ఎన్నో పనులు చేశాడు. ఎల్లప్పుడూ సంపదతో తూలతూగే ఇతడి రాజ్యంలో కరవు అనేది ఉండేది కాదు. కానీ ఒకసారి వరుసగా మూడు సంవత్సరాలు కరవు వచ్చింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో మతపరమైన అన్ని కార్యక్రమాలు నిలిచిపోయాయి. దీని కారణమేంటని తెలుసుకోవడానికి అంగీర అరణ్యంలో ఉన్న ఓ మహర్షి వద్దకు వెళ్లాడు మాంధాత. అప్పుడు ఆ మహార్షి దేవశయని ఏకాదశి గురించి చెప్పాడు. ఈ ఏకాదశి రోజున ప్రజలందరూ ఉపవాసం ఉండి శ్రీహరిని పూజిస్తే.. కరువు కాటకాల నుండి విముక్తి పొందవచ్చని ఆ మహర్షి సూచించారు. మాంధాత, అతడి రాజ్యంలోని ప్రజలు ఈ వ్రతాన్ని పాటించడంతో కరవు కాటకాలు తొలగిపోయాయి.
Also Read: ShaniDev Remedies: శనిదేవుడికి ఈ పరిహారం చేయడం వల్ల మీ లైఫ్ కు తిరుగుండదు!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
.