Shani Dev - Saturn Capricorn : శని దేవుడి ప్రభావం వల్ల జీవితం తలకిందులు అవుతుంది. అప్పుడప్పుడ శని వల్ల లాభాలు కూడా చేకూరుతాయి. శనిదేవుడి ప్రయాణించే మార్గం వల్ల ఈ ఫలితాలు వస్తుంటాయి. మనిషి కర్మలను బట్టి శనిదేవుడి ఫలితాలను ఇస్తుంటాడు. అయితే ఇప్పుడు ధంతేరాస్ సమయంలో శనిదేవుడు ప్రయాణించే మార్గం మారుతుంది. మకరరాశిలో తిరోగమన దశలో ఉన్నాడు. శనిదేవుడు వక్రదృష్టి మనిషి మీద పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే శని దేవుడు ప్రస్తుతం మకరరాశిలోకి ప్రవేశించడం, తిరోగమనస్థానంలో ఉండటంతో కొన్ని లాభాలు చేకూరతాయి. అక్టోబర్ 23న ఈ రాశిలో సంచరిస్తాడు, 17 జనవరి 2023 వరకు మకరరాశిలో ఉంటాడు. దీని తర్వాత జనవరి 17న కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. మకరరాశిలో శని దేవుడి మార్గం కారణంగా, అన్ని రాశులలో శుభ, అశుభ ప్రభావాలు ఉంటాయి. అయితే మకర, కుంభ, మీన రాశుల వారికి మాత్రం శుభాలే కలుగుతాయి.


మకరరాశి : మకరరాశిలో శనిదేవుడు సంచరించడం వల్ల పంచ మహాపురుష యోగం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. దీని వల్ల ఈ రాశి వారికి ఎంతో మేలు కలుగుతుంది. అపజయం అన్నది ఎరుగక.. ప్రతి విషయంలో విజయం సాధిస్తారు. చెడు విషయాలు కూడా జరుగుతాయి. ధనం లాభం అధికంగా ఉంటుంది. నిలిచిపోయిన పనులు పూర్తి  చేయడమే కాకుండా.. ఉద్యోగంలో పురోగతి, వ్యాపారంలో లాభాలు కలుగుతాయి.


కుంభ రాశి : కుంభ రాశి వారికి కూడా శుభ ఫలితాలు వస్తాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగం, ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్స్ వంటివి వస్తాయి. వ్యాపారంలో చాలా లాభాలు కలుగుతాయి.


మీనరాశి : మీన రాశి వారికి బలమైన ప్రయోజనాలు లభిస్తాయి. అధికమొత్తంలో డబ్బు పొందుతారు. ఎక్కడి నుంచైనా సరే ఆకస్మికంగా ఆ డబ్బు అందడం జరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి.


(నిరాకరణ: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)


Also Read : Chiranjeevi Godfather : చిరంజీవిని దెబ్బ కొట్టేసిన అల్లు అరవింద్.. గాడ్ ఫాదర్ పని ఇక ఖతం


Also Read : Kantara Movie Budget : కాంతారాకు పెట్టింది ఎంత?.. వచ్చింది ఎంత?.. దెబ్బకు కేజీయఫ్ అవుట్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook