Dhumavati Jayanti 2022: ధూమావతి జయంతి ఎప్పుడు? దీనిని ఎందుకు జరుపుకుంటారు?
Dhumavati Jayanti 2022: ఈ సంవత్సరం ధూమావతి జయంతి బుధవారం జూన్ 08న వస్తుంది. జ్యేష్ఠ శుక్ల అష్టమి నాడు ధూమావతి జయంతిని జరుపుకుంటారు. ధూమావతి జయంతి విశిష్టత, పూజా సమయం గురించి తెలుసుకుందాం.
Dhumavati Jayanti 2022: ధూమావతి జయంతిని ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష అష్టమి తిథి నాడు జరుపుకుంటారు. ఈ ఏడాది ధూమావతి జయంతి జూన్ 08 (Dhumavati Jayanti 2022) బుధవారం నాడు వచ్చింది. శివుడు తెలిపిన 10 మహావిద్యలలో ధూమావతి ఒకటి. ఇది ఏడో మహావిద్య. తల్లి పార్వతి (Goddess Parvathi) యెుక్క భయంకరమైన రూపాన్నే ధూమావతి అంటారు. పేదరికం నుంచి బయటపడటానికి, వ్యాధులను తొలగించడానికి ధూమావతి తల్లిని పూజిస్తారు. ధూమావతి జయంతి ఖచ్చితమైన తేదీ, పూజ ముహూర్తం మరియు తల్లి ధూమావతి వ్రత కథ గురించి తెలుసుకుందాం.
ధూమావతి జయంతి 2022 తేదీ:
పంచాంగం ప్రకారం, జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష అష్టమి తిథి జూన్ 07, మంగళవారం ఉదయం 07:54 గంటలకు ప్రారంభమై... జూన్ 08, బుధవారం ఉదయం 08.30 వరకు ఉంటుంది. ధూమావతి జయంతిని జూన్ 08న ఉదయతిథి ఆధారంగా నిర్వహించనున్నారు.
ధూమావతి జయంతి 2022 పూజ ముహూర్తం:
జూన్ 08వ తేదీ ఉదయం సిద్ధి యోగం ప్రారంభమై... జూన్ 09వ తేదీ తెల్లవారుజామున 03.27 వరకు కొనసాగుతోంది. ధూమావతి జయంతి రోజున ఉదయాన్నే సిద్ధి, రవి యోగం ఏర్పడుతున్నాయి. జూన్ 09 తెల్లవారుజామున 04.31 నుండి 05.23 వరకు సర్వార్థ సిద్ధి యోగం ఉంటుంది. అదే రోజున, రవియోగం ఉదయం 05:23 నుండి మధ్యాహ్నం 12.52 వరకు ఉంటుంది.
ధూమావతి కథ
ధూమావతి తల్లి పార్వతి దేవి యొక్క ఉగ్ర రూపం. ఈమె వితంతువు. వదులుగా ఉన్న కేశాలతో తెల్లటి చీర కట్టుకుని రథం మీద వెళుతుంది. ఈమె వాహనం కాకి. ఒకసారి మాత పార్వతికి చాలా ఆకలి వేసింది. ఆహారం ఇవ్వమని శివుడిని అడిగింది. దీంతో శివుడు వెంటనే ఏర్పాట్లు చేయమని ఆదేశించాడు. అయితే ఎంత సేపటికీ ఆహరం రాకపోవడంతో ఆకలి తట్టుకోలేకపోయిన పార్వతి...శివుడిని మింగేసింది. దాంతో ఆమె శరీరం నుంచి పొగలు వచ్చి...పరమశివుడు బయటకు వచ్చాడు. నీభర్తను మాత్రమే నీవు మింగేశావు కనుక ఇక నుండి విధవ రూపంలో ఉండి ధూమావతిగా ప్రసిద్ధి చెందుతావు అని శివుడు అన్నాడు.
Also Read: Vinayak Chaturthi June 2022: రేపే వినాయక చతుర్థి.. ఈ 6 పనులు చేయడం ద్వారా మీ కష్టాలు దూరమవుతాయి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook