Diwali 2020: దీపావళి అంటే ఐదు రోజుల పండగ, పూజా విధులు, మంత్రాలు తెలుసుకోండి
Diwali 2020 Vidhi Laxmi Puja |దీపావళికి వస్తూ ఊరూ వాడా అంతా కొత్త కళ కనిపిస్తుంది. మార్కెట్లు జిగేళుమంటాయి. ఇట్లు తళతళా మెరిపోతుంటాయి. ఐదు రోజుల పండగ అయిన దీపావళిని అంతర్జాతీయంగా సెలబ్రేట్ చేస్తుంటారు. దీపావళి తొలిరోజు ధన త్రయోదశిగా చేసుకుంటారు.
Happy Diwali | దీపావళికి వస్తూ ఊరూ వాడా అంతా కొత్త కళ కనిపిస్తుంది. మార్కెట్లు జిగేళుమంటాయి. ఇట్లు తళతళా మెరిపోతుంటాయి. ఐదు రోజుల పండగ అయిన దీపావళిని అంతర్జాతీయంగా సెలబ్రేట్ చేస్తుంటారు. దీపావళి తొలిరోజు ధన త్రయోదశిగా చేసుకుంటారు. ఈ రోజు ప్రజలు బంగారం, వెండి కొంటారు.. రెండో రోజు నరక చతుర్దశి, మూడవ రోజు లక్ష్మీ పూజను చేస్తారు. నాలుగవ రోజు గోవర్ధన పూజను చేస్తారు. ఐదవ రోజు ఉత్తర భారతదేశంలో భాయ్ దూజ్ పూజ చేస్తారు.
Also Read | Diwali 2020 Decoration In 30 Minutes: ఈ దీపావళికి 30 నిమిషాల్లో ఇంటిని డెకరేట్ చేసుకోండి
దీపావళి ( Diwali 2020 ) మూడవ రోజు లక్ష్మీపూజ చేస్తారు. ఐదు రోజుల వేడుకలో ఈ మూడవ రోజుకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఈ రోజు లక్ష్మీదేవి, వినాయకుడి పూజలు చేస్తారు. ఇంట్లో, వ్యాపార కేంద్రాల్లో, షాపుల్లో అన్ని చోట్లా విధిగా పూజలు చేస్తారు.
ఈ రోజు పూజ చేయడం వల్ల ధనలక్ష్మీ కటాక్షం కలుగుతుంది. సంపద ( Wealth ) చేకూరుతుంది. శుభం కలుగుతుంది.
Also Read | Diwali 2020 Wishes: సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో, స్టేటస్ లో షేర్ చేయడానికి దీపావళి విసెష్
లక్ష్మీ పూజా మంత్రాలు, హారతి, పూజల విధి | Laxmi Puja on Diwali, Aarti and Puja Vidhi
లక్ష్మీ పూజా విధి:
ఈ సంవత్సరం ప్రదోష సమంలో సాయంత్ర వేళ లక్ష్మీ పూజను చేయనున్నారు. ఈ సమయంలో కిటికీలు, తలుపులు తెరిచే ఉంచాలి. మీ ఇంటికి లక్ష్మీ దేవీని ఆహ్వనించి ఆమె గౌరవార్దం దీపాలను వెలిగించాలి. తరువాత లక్ష్మీదేవీని, వినాయకుడిని, సరస్వతిని, కుబేరుడిని పూజించాలి
కొన్ని రాష్ట్రాల్లో శ్రీకృష్ణుడిని కూడా పూజిస్తారు. బెంగాల్ లో కాళీ మాతను పూజిస్తారు. లక్ష్మీ పూజ తరువాత ఇంటి బయట టపాకాయలు కాల్చడం ( ఈ సారి కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని పాటించాల్సి ఉంటుంది ) బంధుమిత్రులకు, చుట్టుపక్కల వారికి మిఠాయిలను పంచాల్సి ఉంటుంది.
Also Read | Diwali 2020 ఈ దీపావళికి ఈ రాశుల వారికి బాగా కలిసొస్తుందట, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి!
లక్ష్మీ పూజ మంత్రం
లక్ష్మీ బీజ్ మంత్ర
ఓ హ్రీం శ్రీం లక్ష్మీభయో నమ:
ఓ శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలాయే ప్రసీద ప్రసీద ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మాయ నమ:
మరిన్ని దీపావళికి సంబంధించిన స్టోరీస్ చదవాలి అనుకుంటే క్లిక్ చేయండి
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR