Diwali 2020 Wishes: దీపావళి శుభాకాంక్షలు, గ్రీటింగ్స్, మెసేజీలు

Happy Diwali 2020 Wishes In Telugu | దీపాల పండుగ దీపావళి. లక్ష్మీ కటాక్షం కలిగే శుభదినం. కొత్తగా జీవితాన్ని ప్రారంభించడానికి ఇదే మంచి తరుణం. పిల్లాపాపలతో ఆనందంగా భారతీయులంతా కలిసి చేసుకునే వేడుక ఇది. కరోనాకారణంగా (Coronavirus)  మనం ఈసారి అందిరీ కలిసి దీపావళి ( Diwali  2020 ) శుభాకాంక్షలు తెలిపే అవకాశం లేకపోవచ్చు.

Last Updated : Nov 13, 2020, 11:18 AM IST
    1. దీపాల పండుగ దీపావళి. లక్ష్మీ కటాక్షం కలిగే శుభదినం. కొత్తగా జీవితాన్ని ప్రారంభించడానికి ఇదే మంచి తరుణం.
    2. పిల్లాపాపలతో ఆనందంగా భారతీయులంతా కలిసి చేసుకునే వేడుక ఇది.
    3. మనం ఈసారి అందిరీ కలిసి శుభాకాంక్షలు తెలిపే అవకాశం లేకపోవచ్చు.
    4. కానీ మన ఫోన్ ఉంది కదా.. అందులోంచి మెసేజీలు మాత్రం చక్కగా పంపించుకోవచ్చు.
Diwali 2020 Wishes: దీపావళి శుభాకాంక్షలు, గ్రీటింగ్స్, మెసేజీలు

Happy Diwali 2020 Greetings In Telugu |దీపాల పండుగ దీపావళి. లక్ష్మీ కటాక్షం కలిగే శుభదినం. కొత్తగా జీవితాన్ని ప్రారంభించడానికి ఇదే మంచి తరుణం. పిల్లాపాపలతో ఆనందంగా భారతీయులంతా కలిసి చేసుకునే వేడుక ఇది. కరోనా కారణంగా (Coronavirus)  మనం ఈసారి అందిరీ కలిసి దీపావళి ( Diwali  2020 ) శుభాకాంక్షలు తెలిపే అవకాశం లేకపోవచ్చు. కానీ మన ఫోన్ ఉంది కదా.. అందులోంచి మెసేజీలు మాత్రం చక్కగా పంపించుకోవచ్చు. మీరు సోషల్ మీడియా ఖాతాలో( Social Media ), వాట్సాప్ గ్రూపుల్లో, వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకోవడానికి దీపావళి విసెష్ అందిస్తున్నాం. వీటిని మీ బంధు మిత్రులు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. ఆనందాన్ని పంచండి.

Also Read | Diwali 2020 Laxmi Puja: లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే దీపావళి పూజలో ఈ పదార్థాలు ఉండేలా చూసుకోండి! 

1. అజ్ఞానం చీకట్లను పారద్రోలి మన జీవితంలో వెలుగులు నింపేది దీపావళి.
అందికీ శుభం చేకూరాలని కోరుకుంటూ...
అందరికీ దీపావళి శుభాకాంక్షలు !!!

2.  దీపం జ్యోతి: పరబ్రహ్మ దీపం సర్వతమోపహమ్, !
దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమోస్తుతే... !!

ప్రపంచాన్ని తేజోవంతం చేసేరోజు దీపావళి, భారతీయ సంస్కృతికి ఈ పర్వదినం ప్రతిబింబం. జగతికి చైతన్యం కలిగించే వేడుక ఇది.

Also Read | Diwali Special Lamp: ఎప్పుడూ ఆరిపోని దీపాన్ని తయారు చేశాడు..పూర్తి వివరాలు చదవండి

3. దీపావళి  దీపాల వరస దీపావళి, నవ్య ఆనంద ఆరావళి
మనజీవితాలలో వెలుగును నింపే నిత్య సంతోష సరాగావళి !!

మీకు మీ కుటుంబ సభ్యులకు 
దీపావళి శుభాకాంక్షలు !!!
4.లక్ష్మీ మీ ఇంట నర్తించగా, సంతోషం పాలౌ పొంగగా
దీప కాంతులు వెలుగునీయగా అనందంగా చేసుకుందాం దీపావళి పండగ
దీపావళి శుభాకాంక్షలు

Also Read | Firecrackers in Diwali: టపాసులపై బ్యాన్ విధించిన 6 రాష్ట్రాలు. లిస్ట్ చెక్ చేయండి

5. దీపావళి నాడు మీ ఇంట వెలిగే జ్యోతులు
మీ జీవితమంతా ఆనంద కాంతులు నింపాలని ఆశిస్తూ 
మా ఖాతాదారులకు మిత్రులకు, శ్రేయోభిలాషులకు
దీపావళి శుభాకాంక్షలు

6. చీకటిపై వెలుగు విజయమే దీపావళి పండగ,
దుష్టశక్తులను పారద్రోళి కొంగొత్త జీవితానికి
స్వాగం పలికే వెలుగుల రోజే దీపావళి పండగ
దీపావళి శుభాకాంక్షలు !!!

Also Read : Tips To Buy Gold: ఈ దీపావళికి బంగారం కొంటున్నారా?  అయితే ఈ టిప్స్ మీకోసమే!

7. తీయని నేతి మిఠాయిలతో..
వెలుగొందే ఎన్నో టపాసులతో..
అందరూ కలిసి నవ్వుతూ సంతోషంగా
దీపావళిని జరుపుకోవాలి అని కోరుకుంటూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు 
దీపావళి శుభాకాంక్షలు.. !!!

8. చీకటి వెలుగుల రంగేళి...
జీవితమే ఒక దీపావళి..

దీపావళి శుభాకాంక్షలు !!!

Also Read | Diwali 2020 ఈ దీపావళికి ఈ రాశుల వారికి బాగా కలిసొస్తుందట, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి!

9. నరకాసురుని వధించి..
నరులందరి జీవతాలలో
వెలుగును నింపిన
మాత సత్య శౌర్యానికి
చెడుపై మంచి విజయానికి
ప్రతీక ఈ దీపావళి !!!

10.

ఈ దీపావళి మీ ఇంట కురిపించాలి సిరుల పంట
మీరంతా ఆనందంగా ఉండాలంట,
అందుకోండి శుభాకాంక్షల మూట

మీకు, మీ కుటుంబ సభ్యులకు 
దీపావళియ శుభాకాంక్షలు.. !!!

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News