Kartik Month 2022 Tulsi Puja:  కార్తీక మాసంలో తులసి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని స్కంద పురాణంలో పేర్కొన్నారు. ఈ మాసంలో  తులసి దేవిని పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని హిందువు భక్తులు నమ్ముతారు. అయితే కార్తీక మాసంలో శ్రీమహావిష్ణువు, లక్ష్మి మాతను పూజించడం వల్ల ఇంట్లో సుఖ శాంతులు లభించడమేకాకుండా ధన ప్రవాహం లభిస్తుందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే    కార్తీక మాసంలో తులసిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల సులభంగా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి ఇలా పూజించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కార్తీక మాసంలో తులసి నివారణలు తెలుసుకోండి:
>>కార్తీకమాసంలో బ్రహ్మ ముహూర్తంలో లేచి తులసిని పూజించి పాలతో చేసిన ఆహారాలను నైవేద్యంగా పెట్టడం వల్ల అన్ని పాపాలు తొలగిపోతాయి.
>>కార్తీకమాసంలో తులసికి క్రమం తప్పకుండా నీరు పోస్తే..లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది.
>>ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి.. స్నానాలు చేసి, పసుపు రంగు దుస్తులు ధరించాలి. ఆ తర్వాత సూర్య భగవానున్ని పూజించాలి. అంతేకాకుండా ఈ క్రమంలో మీ ఇష్ట దేవుడిని పూజించండి. ఇలా చేయడం వల్ల మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి.
>>కార్తీక మాసంలో తులసి మాతను క్రమం తప్పకుండా పూజలో భాగంగా పసుపును పసుపును వినియోగించాలి. అంతేకాకుండా  నెయ్యి దీపాన్ని కూడా వెలిగించి.. తులసి మాత చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మి దేవి అనుగ్రహం లభించి.. భవిష్యత్‌లో మంచి ప్రయోజనాలు పొందుతారు.
>>ఆ తర్వాత తులసికి హారతిని ఇచ్చి మంత్రాన్ని జపించాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే భవిష్యత్‌లో మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతేకాకుండా ఈ క్రమంలో తప్పకుండా భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు కూడా పాటించాల్సి ఉంటుంది.
>>ముఖ్యంగా కార్తీక మాసంతో ఉపవాసాలు పాటించే క్రమంలో కేవలం పాలు , పండ్లను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు,  సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)


 


Also Read: Share Market: ఈ రంగాల్లో పెట్టుబడితో భారీ లాభాలు ఆర్జించే అవకాశం, మార్కెట్ నిపుణుల సూచన ఇదే


Also Read: Share Market: ఈ రంగాల్లో పెట్టుబడితో భారీ లాభాలు ఆర్జించే అవకాశం, మార్కెట్ నిపుణుల సూచన ఇదే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook