Shani Trayodashi: శని కర్మలను బట్టి ఫలాలను ఇస్తాడు. శనివక్రదృష్టితో బాధలుపడుతాం. అయితే శని దశ ముగిసిపోయేటప్పుడు కూడా ఆయన మనకు మంచి చేసి వెళ్తాడు అంటాడు. శనివాహనం కాకి. అయితే, శనిదోషం నుంచి విముక్తి పొందడానికి శనిత్రయోదశి అత్యంత అద్భుతమైనరోజు. శనివారం, త్రయోదశి కలిసి వస్తే శనిత్రయోదశి అంటారు. ఈరోజు మార్చి 23 శనిత్రయోదశి. కాబట్టి ఈరోజు ప్రదోషకాలంలో మీరు చేసే ఈ ఒక్కపని వల్ల మీకు శని దోషం తొలగిపోతుంది అంటున్నారు పండితులు. ఆ వివరాలు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శనివారం శనికి అత్యంత ప్రాముఖ్యమైన రోజు. ఈరోజు దేవాలయాలకు వెళ్లి శనిపూజ నిర్వహిస్తారు. నువ్వుల నూనె, నల్లనువ్వులతో శనికి తైలాభిషేకం చేస్తారు. ఈరోజు స్నానదానాలకు కూడా ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ముగజీవాలనకు ఈరోజు ఏదైనా ఆహారం పెట్టాలి. ఈరోజు ఇంట్లోని పెద్దల పట్ల కూడా గౌరవం ఇవ్వకుండా ప్రవర్తించకూడదు. అంతేకాదు ఈరోజు దేవాలయాలకు వెళ్లి రావిచెట్టుకు కూడా పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా శనిత్రయోదశిరోజు మాత్రం నవగ్రహాల చుట్టూ 27 ప్రదక్షిణలు చేస్తారు. అయితే, ఈరోజు ప్రదోషకాలంలో శివపూజకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శనిత్రయోదశిరోజు ప్రదోషకాలంలో మీ దగ్గర్లోని ఏదైనా శివాలయానికి వెళ్లి ఆ శివయ్యకు అభిషేకం చేసి పాలు, నల్లనువ్వులను రెండిటినీ కలిపి శివుడికి అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు ఉన్న శనిదోషం తొలగిపోయి. మీ కెరీర్లో కూడా అభివృద్ధికి బాటలు పడతాయి.


ఇదీ చదవండి:  పెళ్లి కానీ ప్రసాద్ లకు బంపర్ ఆఫర్.. కామదహానం రోజు ఈ రెమిడీ పాటిస్తే నచ్చిన అమ్మాయితో వివాహాం..


అంతేకాదు, శనిత్రయోదశి ప్రదోషకాలంలో ఇంటి బ్రహ్మస్థానంలో బియ్యం పిండితో ముగ్గు వేయాలి. ఆపై మట్టి ప్రమిదపై మరో మట్టి ప్రమిద పెట్టి ఎనిమిది వత్తిలాతో నువ్వుల నూనె దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల శనిదేవుడి అనుగ్రహం వెంటనే కలుగుతుంది.శనిత్రయోదశిరోజు శనిని ఇలా పూజించడం వల్ల శనివక్రదృష్టి నుంచి త్వరగా బయట పడతారని పండితులు చెబుతున్నారు. ఇలా దేవాలయానికి వెళ్లలేనివారు కనీసం ఇంట్లో ఉన్న శివలింగానికి నువ్వులు, పాలు కలిపి అభిషేకం చేయాలి. ఇది కేవలం ప్రదోషకాలంలోనే నిర్వహించాలి. పురాణాల ప్రకారం శనిగర్భంలో ఉన్నప్పుడు ఛాయదేవి శివుడి కటాక్షం కోసం తపస్సు చేస్తుంది. అందుకే ఆ శివయ్య ఆశీస్సులతో శనికి ఈ శక్తులు వచ్చాయి..


ఇదీ చదవండి: మార్చి 25న మెుదటి చంద్రగ్రహణం.. ఈ 3 రాశులకు బ్యాడ్ టైమ్..


శనిత్రయోదశి కథనం..
శని దేవుడి వక్రదృష్టికి భూమిపై ఉన్న ప్రతి జీవి గురికాక తప్పదు. సృష్టికారకుడైనా శివుడు సైతం శని ప్రభావానికి గురికాక తప్పలేదు. ఒకరోజు శివుడు హే.. శనిదేవా.. నేటి నుంచి నా పేరును కూడా కలుపుకొని శనీశ్వరుడిగా మారతావు అంటాడు. ఆ రోజు శని త్రయోదశి కాబట్టి శని వల్ల పీడించబటుతున్నవారు నువ్వులు, నల్లనివస్త్రం, నూనె కలిపి శనిదేవుడికి అభిషేకం చేస్తే అలాంటివారికి ఎలాంటి ఆర్థిక, అనారోగ్య సమస్యలు దరిచేరవని చెబుతాడు. అప్పటి నుంచి శనిత్రయోదశి వాడుకలోకి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook