Holi 2024: పెళ్లి కానీ ప్రసాద్ లకు బంపర్ ఆఫర్.. కామదహానం రోజు ఈ రెమిడీ పాటిస్తే నచ్చిన అమ్మాయితో వివాహాం..

Holi Kamadahanam 2024: హిందూ సంప్రదాయం ప్రకారం హోలీని ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ఈ వేడుకలో కామదహానంతో హోలీ పండగ ప్రారంభమవుతుంది.దీనిలో రాత్రిపూట ఇంట్లో ఉపయోగించని వస్తువులను వేస్తారు. కట్టెలను వేయడం మనంచూస్తుంటాం.

1 /6

ఈ మధ్య కాలంలో చాలా మంది యువత ముఖ్యంగా అబ్బాయిలు పెళ్లి కుదరక తెగ ఇబ్బందులు పడుతున్నారు. అమ్మాయిలకునచ్చే విధంగా ప్యాకేజీలు, ప్రాపర్టీలు లేక పెళ్లిళ్లు కాస్త ఆలస్యమవుతున్నాయి. దీంతో అబ్బాయిలు ఎక్కువ మంది పెళ్లికానీ ప్రసాద్ లుగానే మిగిలిపోతున్నారు.  

2 /6

ముఖ్యంగా పెళ్లిళ్లు కుదరకపోవడానికి జ్యోతిష్య సమస్యలు, ఇంట్లో గతించినవారి శాపలు, జాతకంలో ఉన్న దోషాల మూలంగా పెళ్లిళ్ల సరైన ఏజ్ లో అస్సలు కుదరడం లేదు. ఈ క్రమంలో జ్యోతిష్యులు కొన్ని నియమాలు పాటించాలని చెబుతున్నారు.  

3 /6

పెళ్లిళ్లు సెట్ కాకపోవడానికి కాలసర్పదోషం కూడా ఒక కారణమని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. రేపు అంటే శనివారం రోజున కామదహానంపండుగను ఎంతో వేడుకగా జరుపుకుంటాం. ఆ తర్వాత రోజును హోలీగా జరుపుకుంటారు..  

4 /6

కామదహానం రోజు రాత్రి కట్టెలను పొగుచేసి ఒక చోట్ల మంటలను వేలిగిస్తారు. పెళ్లికానీ వారు ఈ మంటల దగ్గరకు వెళ్లి, పసుపు కొమ్ములను తీసుకుని మూడు సార్లు సవ్యదిశ (క్లాక్) లాగా, మూడు సార్లు అపసవ్య(యాంటీ క్లాక్) మాదిరిగా తిప్పాలి. ఆ తర్వాత.. అగ్నిచుట్టు మూడుసార్లు తిరగాలి. 

5 /6

ఇలా తిరిగి ఆ దిష్టి తీసిన పసుపు కొమ్ములను మంటలలో వేయాలి. ఇలా చేస్తే మనకు ఉన్న దోషాలు పోయి వెంటనే పెళ్లి కుదురుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. పెళ్లిలో ఏర్పడే ఆటంకాలు కూడా దూరమౌతాయని చెబుతారు.

6 /6

కామదహానం మరుసటిరోజున  ఆ భస్మంను ఇంటికి తెచ్చుకుని, పెట్టుకొవాలని ఇలాపెట్టుకుంటే జాతకంలో ఏర్పడిన దోషాలు, దిష్టిదోషాలు అస్సలు ఉండవని కూడా జ్యోతిష్యులు చెబుతుంటారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)